Teaching Jobs: రండి.. బోధించండి
ఈనేపథ్యాన గతంలో విధులు నిర్వర్తించిన పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ ఏడాది కూడా బోధన ప్రారంభించగా, గెస్ట్ లెక్చరర్లను సైతం విధుల్లో చేరాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
అయితే, జూలై 31వ తేదీ వరకే ఉత్తర్వులు విడుదల కాగా, ఆతర్వాత విద్యాసంవత్సరం కొనసాగించే అవకాశముందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
జిల్లాలో 95మంది
జిల్లాలోని 20 కళాశాలల్లో 58మంది గెస్ట్ లెక్చరర్లు, 8మంది పార్ట్ టైం, 29మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పాఠాలు బోధిస్తున్నారు. వీరిలో పార్ట్‌టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఏటా రెన్యువల్ అవుతూ విద్యాసంత్సరం మొదటి నుంచే కళాశాలలకు హాజరవుతున్నారు.
అయితే, గెస్ట్ లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ప్రతీ ఏటా ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యాన జిలాల్లోని 58మందికి శని వారం ఉత్తర్వులు అందించగా కొందరు అదేరోజు విధుల్లో చేరారు. మిగతా వారు సోమవారం విధుల్లో చేరే అవకాశముంది. అయితే, వీరికి ఇచ్చిన ఉత్తర్వుల్లో జూలై 31వ తేదీ వరకే విధులు నిర్వర్తించాలని ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
ఈవిషయమై అధికారులను సంప్రదించగా త్వరలోనే మిగతా విద్యాసంవత్సరమంతా కొనసాగించేలా ఉత్తర్వులు అందే అవకాశముందని తెలిపారు. కాగా, ఏటా విద్యాసంవత్సరం మొదలైన రెండు, మూడు నెలల తర్వాత వీరిని రెన్యూవల్ చేసేవారు. ఈ ఏడాది మాత్రం తొలినాళ్లలో కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ కళాశాలల్లో బోధన సాఫీగా జరగనంది.
2013 నుంచి పనిచేస్తున్నా...
2013 నుంచి గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. గతేడాది బోధించిన వారికి జూలై 31వ తేదీ వరకు విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చారు. ఆతర్వాత మిగతా విద్యాసంవత్సరమంతా కొనసాగేలా ఉత్తర్వులు అందుతాయని అధికారులు చెబుతున్నారు.
– పాషా, గెస్ట్ లెక్చరర్, కారేపల్లి కాలేజీ
ఈ నెలాఖరు వరకు...
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది పని చేసిన 58మంది గెస్ట్ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈమేరకు వారికి సమాచారం ఇచ్చాం. ఈనెల 31వరకు తర్వాత కొనసాగింపుపై ఉత్తర్వులు అందాల్సి ఉంది.
– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
Tags
- Contract Lecturers
- Guest Lecturers
- Part Time Lecturers
- Telangana News
- Jobs
- KhammamSaharkarnagar
- TeachingPositions
- GovernmentJuniorColleges
- ContractLecturers
- PartTimeLecturers
- TeacherShortage
- EducationAppointments
- EducationalInstitutions
- AcademicStaffing
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications