Skip to main content

SA 2 Exams: 1–8 తరగతులకు ఎస్‌ఏ–2 పరీక్షలు.. పరీక్ష తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్‌ 15 నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
SA 2 Examinations

ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 22తో ముగుస్తాయని తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొంది.

చదవండి: New Education Policy: ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాలు..

ఎస్‌ఏ–2 పరీక్షలను ఏప్రిల్‌ 6 నుంచి 20వరకూ నిర్వహించాలని తొలుత టైం టేంబుల్‌ ఇచ్చా రు. అయితే, టీచర్లు ఎన్నికల శిక్షణకు వెళ్లడం, ఇదే సమయంలో కొంతమంది స్పాట్‌ వ్యాల్యూయేషన్‌ విధుల్లో ఉండటం వల్ల ఎస్‌ఏ–2 పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు.  

Published date : 05 Apr 2024 11:28AM

Photo Stories