New Education Policy: ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాలు..
ఎన్టీఆర్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధానాలు భేష్ అంటూ ఉత్తరాఖండ్ ఎస్‌సీఈఆర్టీ జాయింట్ డైరెక్టర్ ఆశా ప్రశంసించారు. ఆమె నేతృత్వంలో విద్యావేత్తల బృందం సింగ్‌నగర్‌లోని ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్‌ను మంగళవారం సందర్శించింది.
Technical Education: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక విద్య
ఉపాధ్యాయులతో మాట్లాడి టైం టేబుల్, ఐఎఫ్‌సీ ప్యానెల్స్ ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు అందజేస్తున్న రోజువారీ మెనూను చూసి అభినందించారు. ఎన్‌సీసీ క్యాడెట్స్, ట్రైనింగ్, క్యాంపుల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరసా వెంకటేశ్వరరావు, ఎన్‌సీసీ ఆఫీసర్ ఎల్‌వీ కృష్ణప్రసాద్ వారికి వివరించారు.
Underwater Metro: కలకత్తాలో అండర్‌వాటర్ మెట్రో లైన్ ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యా విధానం తీరు అద్బుతంగా ఉందని, కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు బోధనా తరగతులు నిర్వహించడం, యూనిఫాం, షూస్, భోజనం వంటి విషయాలలో ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచి పరిణామమని ఆమె కొనియాడారు. సీనియర్ ఉపాధ్యాయుడు కె.రాజశేఖర్, విజయవాడ నార్త్ ఎంఈఓ ఎ.ప్రభాకర్, స్కూల్ సూపర్‌వైజర్ రాజేష్ పాల్గొన్నారు.
Gurukul Admissions: గురుకుల ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ