Technical Education: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాంకేతిక విద్య
ఇందులో భాగంగా మార్చి 5న అన్ని జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులతో రాష్ట్ర ఉన్నతాధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించారు. చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అధికారులతోపాటు 8, 9 తరగతుల విద్యార్థులంతా ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ప్రసంగాన్ని వీక్షించారు.
ఈ మేరకు ‘సెన్సిటైజేషన్ టూ ప్యూచర్ స్కిల్స్ ఎక్సఫర్ట్స్’ పేరిట విద్యార్థులకు భవిష్యత్‌లో అందించాల్సిన సాఫ్ట్ స్కిల్స్‌పై దిశా నిర్దేశం చేశారు.
చదవండి: Free Coaching: నల్గొండ జిల్లాలో ఈ పరీక్షకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ మాట్లాడుతూ విద్యార్థులను సాంకేతికంగా తిర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇంటర్నెట్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ మేనేజ్‌మెంట్ తదితర విజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
డిజిటల్ రూపంలో సాంకేతిక విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులను సైతం ఇటువంటి సమావేశాల్లో భాగస్వాములను చేస్తున్నామని చంద్రకళ చెప్పారు.
డిప్యూటీ డీఈవో గౌరీశంకర్, ఎంఈవో రవీంద్రబాబు, సమగ్రశిక్ష ఏపీసీ బి.శ్రీనివాసరావు, డైట్ కళాశాల అధ్యాపకులు గొట్టేటి రవి, చంద్రంపాలెం హెచ్‌ఎం ఎం.రాజబాబు పాల్గొన్నారు.
చదవండి: Bhavitha Programme for Youth: నైపుణ్య శిక్షణలో విశ్వరూపం