Bhavitha Programme for Youth: నైపుణ్య శిక్షణలో విశ్వరూపం
రాబోయే రోజుల్లో నైపుణ్య శిక్షణలో విశ్వరూపం చూపిద్దాం. అందుకే ఈ ‘భవిత’ కార్యక్రమం’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీడాప్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమాన్ని మార్చి 5న విశాఖలోని పీఎంపాలెం వి–కన్వెన్షన్ హాల్‌లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, విడదల రజని, పారిశ్రామిక ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే...
చదవండి: AP Education Schemes: నాడు-నేడు పథకంతో అభివృద్ధి చెందిన విద్య
జాబ్ ఓరియెంటెడ్‌గా
రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చి అనుసంధానించే కార్యక్రమ్రాన్ని నిర్వహిస్తున్నాం. ఏ చదువైనా జాబ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. క్వాలిటీ చదువులు మనకు అందుబాటులో లేకపోతే పూర్తిగా వ్యర్థమైపోయినట్లే. అందుకే జాబ్ ఓరియెంటెడ్‌గా క్వాలిటీ చదువులతో మార్పులు తెస్తున్నాం. నాణ్యమైన విద్యని స్కూల్స్ నుంచి కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు.. అన్ని చోట్లా అందిస్తూ అడుగులు వేస్తున్నాం.
చదవండి: SI Paper Leakage: ఎస్‌ఐ పరీక్ష రద్దు! రూ. 2 కోట్లకు ప్రశ్నపత్రం అమ్ముడైనట్లు వెలుగులోకి..
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేయడం నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా ఎలా ముందుకు వెళ్తున్నామో అందరికీ తెలిసిందే. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్, టోఫెల్ శిక్షణ, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్యాబ్స్ ద్వారా విద్యలో నాణ్యత పెంచుతున్నాం. డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఇలాగే అడుగులు వేస్తున్నాం.
- తొలిసారిగా కాలేజీల్లో కరిక్యులమ్ మార్చడం, నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ, తప్పనిసరి ఇంటర్న్‌షిప్, ఆన్‌లైన్ వర్టికల్స్, క్రెడిట్స్ మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివన్నీ చేస్తున్నాం. హార్వర్డ్, ఎల్‌సీఈ, ఎల్‌బీఎస్, ఎంఐటీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నాం. వాటి ద్వారా దరఖాస్తు చేసుకుంటే మంచి జీతాలతో ఉన్నత ఉద్యోగాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తరహా మార్పు ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గర నుంచే మొదలవుతోందని గర్వంగా చెబుతున్నా.
- ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్ కాలేజీల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. వచ్చే టర్మ్‌లో ఈ మార్పులు విశ్వరూపం దాలుస్తాయి. తొలిసారిగా 158 పారిశ్రామిక సంస్థలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కలిపి మొత్తం 208 ఇన్‌స్టిట్యూషన్లు మన పిల్లల ట్రైనింగ్, కోర్సుల్లో భాగస్వాములై శిక్షణ అందించి ఉద్యోగాలిచ్చే కార్యక్రమం జరుగుతోంది.దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019కి ముందు (టీడీపీ హయాంలో) అక్రిడిటేషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీ కేవలం ఒక్కటి మాత్రమే ఉండటం దురదృష్టం. కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువులు ఎలా ఉన్నాయి? అక్రిడిటేషన్ ఉందా? అనేది కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ని 32 పాలిటెక్నిక్ కాలేజీలు పొందాయి. క్వాలిటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.
- రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్‌మెంట్ హబ్ క్రియేట్ చేస్తాం. హబ్ ద్వారా ఒకే చోట ఐటీఐ, పాలిటెక్నిక్, పదోతరగతి డ్రాపవుట్స్ కోసం ట్యూటరింగ్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్‌లో స్కిల్ కాలేజీ ఉంటుంది. వీటన్నింటి పైన ఒక స్కిల్ యూనివర్సిటీ కోర్సుల్ని డిజైన్ చేస్తుంది. పరిశ్రమల్ని కాలేజీల్లో భాగస్వాముల్ని చేస్తుంది. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం వచ్చేలా అడుగులు పడుతున్నాయి.
- ఇప్పటివరకూ 53 వేల మంది శిక్షణ పూర్తి చేసుకొని 26 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన భవిత కార్యక్రమం ఇకపై పైలట్‌గా కాకుండా ప్రతి నియోజకవర్గంలో విస్తరించే దిశగా శ్రీకారం చుడుతున్నాం.
సీఎం సమక్షంలో ఎంవోయూలు
- ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి నైపుణ్య శిక్షణ అందించేందుకు పలు సంస్థలు ఆరు ఎంవోయూలు చేసుకున్నాయి.
- విశాఖ పోలీస్ కమిషనరేట్‌తో మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వైజాగ్ పోలీస్ వర్క్‌ఫోర్స్ నైపుణ్య సామర్థ్యాలు పెంపొందించేలా జాయింట్ సర్టిఫికేషన్ కోర్సులు అందించేలా సహకారం అందించనున్నారు.
- ఏపీఎస్‌ఎస్‌డీసీతో హియర్ టెక్నాలజీస్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు లొకేషన్ సొల్యూషన్స్ కోసం ప్లాట్ ఫామ్ అందించేలా 60–90 రోజుల సర్టిఫికేషన్ కోర్సు అందించేందుకు ఒప్పందం జరిగింది.
- ఏపీఎస్‌ఎస్‌డీసీ, తాజ్‌హోటల్స్, ఎస్‌ఐహెచ్‌ఎం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పర్యాటకం,హాస్పిటాలిటీ రంగంలో శిక్షణ అందించడం, ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు, ఉపాధి అవకాశాలు సృష్టించేలా ఒప్పందం కుదిరింది.
- ఏపీఎస్‌ఎస్‌డీసీ, డిక్సన్ టెక్నాలజీస్, నాలుగు ఐటీఐలు, మూడు పాలిటెక్నిక్ కాలేజీల మధ్య ఎలక్ట్రానిక్, మెకానికల్ రంగంలో ఇండస్ట్రీ స్పెసిఫిక్ ల్యాబ్ ఏర్పాటు చేయడం, పరిశ్రమకు అనుగుణంగా శిక్షణ, ఉపాధి పొందేలా ట్రైనింగ్ ఇవ్వడం మొదలైన అంశాల్ని అందించేలా ఎంవోయూ జరిగింది.
- వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ మధ్య ఎంవోయూ జరిగింది. కాలేజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపించనున్నారు. వీల్స్ ఇండియా ద్వారా అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అందించనున్నారు.
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్‌ఎడ్యుకేషన్, అవెరా ఏఐ మొబిలిటీ మధ్య ఈవీ టెక్నాలజీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపనకు మార్గం సుగమం చేసేలా, పరిశ్రమలు సందర్శించేందుకు ఏర్పాటు చేసేలా ఎంవోయూ జరిగింది.
- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్(డీఈటీ), ఎల్ అండ్ టీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీఐ కోర్సులతో సమానంగా ఈ లెర్నింగ్ మాడ్యుల్స్ అందించడం, ఎల్ అండ్ టీ బృందం ద్వారా విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాన్ని ఈ ఎంవోయూ ద్వారా అందించనున్నారు.
10 స్కిల్ సెంటర్లకు శంకుస్థాపన..
ఎంపీ ల్యాడ్స్ ద్వారా రూ.7 కోట్లతో 10 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.44.32 కోట్లతో 43 పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణ పనులను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
రూ.43.77 కోట్లతో 22 ఐటీఐల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవిత కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు భవిత లోగో, యాంథమ్, స్కిల్ యూనివర్స్ యాప్, ఫ్లాగ్‌ని ఆవిష్కరించారు. అంతకు ముందు వీ కన్వెన్షన్‌కు చేరుకున్న సీఎం తొలుత స్కిల్ ఇన్‌స్టిట్యూట్స్ స్టాల్స్‌ని సందర్శించారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీలు తయారీ, విమాన విడిభాగాల తయారీ శిక్షణ తదితర స్టాల్స్‌ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.