AP Education Schemes: నాడు-నేడు పథకంతో అభివృద్ధి చెందిన విద్య
అన్నమయ్య: గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. ఓ వైపు పాఠశాలల్లో వసతులు, మరో వైపు విద్యార్థులకు అవసరమైన సామగ్రి సకాలంలో అందిస్తుండడంతో వారికి కార్పోరేట్ స్థాయి విద్య అందుతోంది.
Entrance Exam: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ విడుదల..
గతం కంటే ఫలితాలు మెరుగు పడ్డాయి. అందుకే ప్రైవేట్ పాఠశాలలో చదివే నా కుమార్తె మదీనాను 8వ తరగతి నుంచి జడ్పీ గర్‌ల్స్ హైస్కూల్‌లో చేర్పించాను. ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ని వసతులు కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు.
–పి.రహంతుల్లా, కమలాపురం
సొంతింటి కల నెరవేరింది
గతంలో మాకు సొంత ఇల్లు లేకపోవడంతో బాడుగ ఇంట్లో ఉండేవాళ్లం. అద్దె డబ్బులు చెల్లించేందుకు నానా ఇబ్బందులు పడేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటి స్థలంతో పాటు పక్కా గృహం కూడా మంజూరు కావడం ఆనందంగా ఉంది. సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు కృతజ్ఞతలు.
–సుధారాణి. ములకలచెరువు, అన్నమయ్య జిల్లా
SI Paper Leakage: ఎస్‌ఐ పరీక్ష రద్దు! రూ. 2 కోట్లకు ప్రశ్నపత్రం అమ్ముడైనట్లు వెలుగులోకి..
ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ చరిత్రాత్మకం
తమ లాంటి నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించడం చరిత్రాత్మకం. భవిష్యత్తులో మాకు కలిగే ఉపయోగాలను ఆయన వివంరించారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే ఇంటి పట్టా రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయించారు. దేవుడులా మాలాంటి నిరుపేదలను సీఎం జగన్ ఆదుకుంటున్నారు.
– ఎస్.జరీనాబేగం, జెండామానువీధి, చిన్నమండెం
Tenth Class Exam 2024:పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు చకాచకా ఏర్పాట్లు....
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రజా సంక్షేమానికి
ప్రాధాన్యత ఇస్తున్నారు. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా లభించని సర్టిఫికెట్లు నేడు జగనన్న సురక్ష ద్వారా సత్వరమే అందుతున్నాయి. దయనీయ స్థితిలో ఉన్న సర్కారు బడుల రూపు రేఖలు నాడు–నేడుతో ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. సొంతంగా సెంటు స్థలం కొనే స్థోమత లేక.. అద్దె చెల్లించలేక అవస్థలు పడుతున్న పేదల సొంతింటి కల సాకారమవుతోంది. వెరసి పేదల బతుకులు బాగుపడ్డాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
–సాక్షి నెట్‌వర్క్
MBA Admissions In NIT Warangal: నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రవేశాలు,అప్లికేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే..