Skip to main content

TS 10th Class Supplementary Results :టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో నిర్మల్‌ జిల్లా టాప్‌.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఎప్పుడంటే...

Recounting and Re-verification Application Details  TS 10th Class Supplementary Results  Hyderabad Class X Advanced Supplementary Results

సాక్షి, హైదరాబాద్‌:  పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 34,126 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 20,694 మంది పాసైతే, బాలికలు 13432 మంది పాసయ్యారు. 73.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. టెన్త్‌ కామన్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించారు. మొత్తం 46,731 మంది హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను టెన్త్‌ పరీక్షల విభాగం శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. 

నిర్మల్‌ జిల్లా 100 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిస్తే, వికారాబాద్‌ జిల్లాలో అతి తక్కువ ఉత్తీర్ణత (42.14 %) నమోదైంది. హైదరాబాద్‌లో 71.22 శాతం విద్యార్థులు పాసయ్యారు. కొంతమంది విద్యార్థులకు సంబంధించిన సరైన సమాచారం లేనందున వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. త్వరలో వీరి ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. 

TS 10th Class Supplementary Exams 2024 Results : టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

  
రీ కౌంటింగ్‌కు జూలై 8 వరకూ చాన్స్‌ 
మూల్యాంకన పత్రాలు, మార్కులపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 8వ తేదీ వరకూ ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించి రీ కౌంటింగ్‌ చేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. రీ వెరిఫికేసన్‌ కోరే విద్యార్థులు హాల్‌ టికెట్‌ జిరాక్స్, కంప్యూటరైజ్డ్‌ ప్రింటెడ్‌ మెమో కాపీతో సంబంధిత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలి. రీ వెరిఫికేసన్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.    

Published date : 29 Jun 2024 10:11AM

Photo Stories