Transfers of Teachers: ‘బదిలీ’ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఎస్జీటీ, తత్సమాన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు.
జూన్ 29న రాత్రి నుంచి 30 రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. సాంకేతిక కారణాలతో కొంత మంది ఇబ్బందులకు గురయ్యారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూ ర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కా నుండగా, ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు సైతం వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నారు.
చదవండి: School Teachers : ప్రతీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు..
జిల్లాలో 998 మంది ఎస్జీటీలు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 617 మంది ఉన్నారు.
వీరందరికి తప్పనిసరి బదిలీ కానుంది. వీరితో పాటు 200 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగే అవకాశాలున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. బదిలీ ఉత్తర్వులు మరో రెండు మూడు రోజుల్లో జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Published date : 01 Jul 2024 03:36PM