School Teachers : ప్రతీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు..
జంగారెడ్డిగూడెం: ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రెడ్డిదొర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) జంగారెడ్డిగూడెం జోన్ సమావేశాన్ని జోనల్ కన్వీనర్ యూవీ నరసింహరాజు అధ్యక్షతన స్థానిక మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు.
Vikram Misri: విదేశాంగ కార్యదర్శిగా నియమితులైన విక్రం మిశ్రి
ఈ సందర్భంగా జోన్ చైర్మన్ నరసింహరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున ఐఆర్ ప్రకటించాలని కోరారు. పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలను సకాలంలో మంజూరు చేయాలన్నారు. ఐటీడీఏ యాజమాన్యంలోని పండిట్, పీఈటీ పోస్టులను ఉన్నతీకరించి పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. జోన్ కో–కన్వీనర్లు జె. సోమేశ్వర శాస్త్రి, పీవీఆర్ రాజ్యలక్ష్మి, జంగారెడ్డిగూడెం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐవీ రత్నం, కె.సుబ్బారావు, జిల్లా కౌన్సిలర్ వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.