Education Programs : ప్రభుత్వం చేపట్టిన నేను బడికి పోతా కార్యక్రమంపై ర్యాలీ.. ఇదే ఈ దీని ఉద్దేశం!
కడప: ప్రతి విద్యార్థి చదువుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘నేను బడికి పోతా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని డీఈఓ మర్రెడ్డి అనురాధ పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ మెయిన్ నుంచి ‘నేను బడికి పోతా’ కార్యక్రమానికి సంబంధించి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ పాఠశాల నుంచి ప్రారంభమై కృష్ణ సర్కిల్, ఆకులవీధి మీదుగా తిరిగి పాఠశాల దగ్గర ముగిసింది.
ఈ సందర్భంగా డీఈఓ మర్రెడ్డి అనురాధ మాట్లాడుతూ జూన్ 13వ తేదీ నుంచి జులై 12వ తేదీ వరకు ‘నేను బడికి పోతా’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు ప్రతి విద్యార్థి పాఠశాలల్లో చదువుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏఎల్‌ఎస్ కో ఆర్డినేటర్ చల్లా విశ్వనాథరెడ్డి, ఏఏఎంఓ రామాంజనేయలరెడ్డి, కడప మండల ఎంఈఓ పాలెం నారాయణ, పాఠశాల హెచ్‌ఎం నాగమణి, పాఠశాల చైర్మన్ వెంకటరమణ, ఉపాధ్యాయులు, సీఆర్‌పీ క్రిష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
NTA Releases New Exam Schedule: యూజీసీ నెట్ కొత్త పరీక్షా తేదీలను విడుదల చేసిన ఎన్టీఏ..