Skip to main content

NTA Releases New Exam Schedule: యూజీసీ నెట్‌ కొత్త పరీక్షా తేదీలను విడుదల చేసిన ఎన్టీఏ..

UGC NET Exam Dates Rescheduled  NTA Announcement for UGC NET Exam  NTA Releases New Exam Schedule  NTA UGC NET New Schedule Announcement

పేపర్‌ లీక్‌ నేపథ్యంలో ఇటీవల రద్దు చేసిన యూజీసీ నెట్‌ పరీక్షకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఆగస్టు21- సెప్టెంబర్‌4 మధ్య ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది.

CSIR UGC NET Exam 2024 Postponed: ఎన్టీఏ మరో కీలక ప్రకటన..సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా, కారణమిదే!

గతంలో ఆఫ్‌లైన్‌ మోడ్‌లో పెన్ను, పేపర్‌ విధానంలో ఈ పరీక్షను నిర్వహించేవారు. తాజాగా యూజీసీ నెట్‌ పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధానంలో నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Public Examinations Act 2024: అమల్లోకి పేపర్‌ లీక్‌ నిషేధ చట్టం.. ఇన్నేళ్లు జైలు.. ఇంత‌ జరిమానా..

జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ 2024 పరీక్ష, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్షలను కూడా ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

ఎన్టీఏ విడుదల చేసిన కొత్త షెడ్యూల్‌ వివరాలు

1. NCET 2024- జులై 10, 2024
2. Joint CSIR-UGC NET- జులై 25-27
3. UGC NET June 2024 cycle- ఆగస్టు 21- సెప్టెంబర్‌ 3 వరకు
మరింత సమాచారం కోసం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌  www.nta.ac.inను సంప్రదించండి. 

Published date : 29 Jun 2024 10:50AM
PDF

Photo Stories