Public Examinations Act 2024: అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టం.. ఇన్నేళ్లు జైలు.. ఇంత జరిమానా..
Sakshi Education
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అనైతిక కార్యకలాపాల నిరోధ) చట్టం, 2024ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నీట్, యూజీసీ–నెట్ పేపర్ల లీకేజీ వివాదాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ జూన్ 21న అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
చదవండి: Question Paper Leakage Incidents: ఏడేళ్లు.. 70 లీకేజీలు.. ఆ రాష్ట్రాల్లో అంతే...!
పేపర్ల లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంటు ఈ చట్టం చేయడం తెలిసిందే. దీని ప్రకారం లీకేజీ కేసుల్లో మూడు నుంచి పదేళ్ల జైలు, రూ.కోటి దాకా జరిమానా విధించవచ్చు.
యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది.
చదవండి: NEET Row 2024: పేపర్ లీక్ అయినా నీట్ పరీక్ష రద్దు చేయరా? కారణమేంటి?
Published date : 24 Jun 2024 08:48AM