Short Term Training : ఈ కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణ.. దరఖాస్తులకు చివరి తేదీ!
Sakshi Education
ఏలూరు: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ హబ్ ద్వారా జూనియర్ ఫీల్డ్ టెక్నీషియన్ హోమ్ అప్లయన్సెస్, అసిస్టెంట్ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఏలూరు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారి పి.రజిత ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు అభ్యర్థులు వచ్చేనెల 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పనకు పరిశ్రమల యాజమాన్యాలతో ఐటీఐ కళాశాల ఒప్పందం చేసుకుందని తెలిపారు. 45 ఏళ్లలోపు వయసు, పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులని, మరిన్ని వివరాలకు సెల్‌లో 8978524022 సంప్రదించాలని కోరారు.
Published date : 29 Jun 2024 03:30PM
Tags
- ITI colleges
- short term courses
- Training programs
- Skill Hub
- Prime Minister Kaushal Vikas Yojana
- Applications
- Government ITI Principal P. Rajitha
- Junior Field Technician Home Appliances
- Assistant Manual Metal Arc Welding
- Education News
- Sakshi Education News
- State Skill Development Organization
- Prime Minister Kaushal Vikas Yojana 4.0
- Junior Field Technician Home Appliances
- Assistant Manual Metal Arc Welding
- Eluru Government ITI
- P. Rajitha
- SakshiEducationUpdates