Skip to main content

AGRICET 2024 Admissions : బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ­లో ప్రవేశాలకు అగ్రిసెట్‌–2024.. ఈ విద్యార్థులు మాత్ర‌మే అర్హులు..

గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా అగికల్చరల్‌ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీ­లో ప్రవేశాలకు అగ్రిసెట్‌–2024 నిర్వహిస్తోంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Admissions at B Sc Agriculture Degree College with AGRICET 2024

»    కోర్సు వివరాలు: బీఎస్సీ(ఆనర్స్‌).
»    అర్హత: అభ్యర్థులు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ/ప్రొఫెసర్‌ జయశంకర్‌ తె­లంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ/ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో రెండేళ్ల డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి.వయసు:31.12. 2024 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) విధానంలో జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. çపరీక్ష మాధ్యమం ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. పరీక్ష కాలవ్యవధి 1 గంట 30 నిమిషాలు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కన్వీనర్, అగ్రిసెట్‌–2024, ది అసోసియేట్‌ డీన్, ఎస్‌ వీ అగ్రికల్చరల్‌ కాలేజ్, తిరుపతి–517502, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
»    ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 05.08.2024.
»    హాల్‌టికెట్‌ల డౌన్‌లోడ్‌ తేదీ: 16.08.2024 నుంచి 23.08.2024 వరకు.
»    పరీక్ష తేది: 27.08.2024.
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://angrau.ac.in

Admissions Notification 2024 : అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదల..

Published date : 24 Jul 2024 11:34AM

Photo Stories