INSPIRE Manak Competitions : జాతీయస్థాయి ప్రదర్శన పోటీలు ఇన్‌స్పైర్ మనక్ నోటిఫికేషన్ విడుదల.. ఈ తరగతి విద్యార్థులే అర్హులు..
గంభీరావుపేట: విద్యార్థులను ఆవిష్కరణల వైపు ప్రొత్సహించడానికి కేంద్ర శాస్త్రసాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌లు సంయుక్తంగా జాతీయస్థాయిలో ఏటా ‘ఇన్‌స్పైర్ మనక్’ పురస్కారాలు అందిస్తున్నాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనల పెంపొందించడానికి ఈ పోటీలు దోహదపడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం కూడా విద్యాశాఖ ఇన్‌స్పైర్ మనక్ కోసం నోటిఫికేసన్ విడుదల చేసింది. జాతీయస్థాయి శాస్త్రీయ ప్రదర్శన పోటీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
NEET UG 2024:‘నీట్ యూజీ-2024’కు రీ ఎగ్జామ్ లేదు: సుప్రీంకోర్టు
దరఖాస్తు విధానం, నామినేషన్ల ప్రక్రియ, ప్రాజెక్టుల ఎంపిక తదితర వివరాలపై టీశాట్ చానల్ ద్వారా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వీలుంది. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలకు పదును పెట్టడమే లక్ష్యంగా ఇన్‌స్పై ర్ మనక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అర్హులు వీరే..
ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ, మోడల్‌స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పాఠశాలల్లోని సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను గైడ్ చేయనున్నారు. మొదట విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, నామినేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రతీ పాఠశాల నుంచి ఐదు నామినేషన్లు
విద్యార్థులకు ప్రోత్సాహం అందించే ఇన్‌స్పైర్ మనక్ పోటీలకు ప్రతీ పాఠశాల నుంచి తరగతికి ఒకరు చొప్పున ఐదు నామినేషన్లు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. చివరికి రాష్ట్రపతి భవన్‌లో ఫెస్టివల్ అండ్ ఎంటర్ ప్రైన్యూర్‌షిప్ పేరిట ప్రదర్శనలు నిర్వహిస్తారు. సమాజానికి ఉపయోగపడేలా వినూత్నంగా శాస్త్రసాంకేతికతను జోడిస్తూ రూపొందించే నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు రూ.10వేలు ప్రొత్సాహకం అందించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు రూపకల్పనకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
గతేడాది 66 ప్రాజెక్టులు ఎంపిక
2023–24 విద్యాసంవత్సరంలో జిల్లా నుంచి 700 ప్రాజెక్టులు సమర్పించగా.. 66 ఎంపికయ్యాయి. ఈ యేడాది వెయ్యికిపైగా ప్రాజెక్టులు రూపొందించి సమర్పించాలని లక్ష్యంగా అధికారులు విద్యార్థులను ప్రొత్సహిస్తున్నారు.
Non Executive Posts : ఎన్‌టీపీసీ మైనింగ్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
ప్రతిభను వెలికితీయడానికే..
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఏటా ఇన్‌స్పైర్ మనక్ పేరిట సైన్స్ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ప్రతీ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు ప్రొత్సహించాలి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రమేశ్‌కుమార్, జిల్లా విద్యాధికారి
ఆలోచన పెట్టెలు ఏర్పాటు చేసుకోవాలి
ప్రతీ పాఠశాలలో విద్యార్థుల ఆలోచనలను సేకరించడానికి ఓ బాక్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల ఆలోచనలను పరిశీలించి నాణ్యమైన ప్రాజెక్టులు రూపొందించి అప్‌లోడ్ చేయాలి. మంచి ఆవిష్కరణలతో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
– పాముల దేవయ్య, జిల్లా సైన్స్ అధికారి
Tags
- Inspire Manak
- Competitions
- School Students
- national level competitions
- students talent
- online applications
- Govt and Private Schools
- sixth to tenth students
- Gurukul and KGBV
- Sept 15
- students education
- Education News
- Sakshi Education News
- InnovationAwards
- ScientificCompetition
- StudentInnovation
- scienceandtechnology
- NationalInnovation
- OnlineApplication
- EducationDepartment
- ScientificPresentation
- NationalLevelCompetition
- sakshieducation updates