Agniveer Vayu Notification : అగ్నివీర్–వాయు 2/2025 నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్ స్కీమ్
వీటికి ఇంటర్, డిప్లొమా అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే వేతనంతోపాటు దేశ సేవలో పాల్పంచుకునే అవకాశం దక్కుతుంది. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. అగ్నివీర్–వాయు 2/2025 నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. అగ్నివీర్–వాయు వివరాలు, ఎయిర్‌ఫోర్స్‌లో కెరీర్ అవకాశాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
అగ్నిపథ్ స్కీమ్
త్రివిధ దళాల్లో ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం అగ్నిపథ్ స్కీమ్‌ను తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆయా దళాల్లో నాలుగేళ్లు విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఖాళీల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఇందులో కమిషన్డ్ ఆఫీసర్ మొదలు పలు ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టనుంది. అగ్నివీర్ వాయు–2025 నోటిఫికేషన్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్, పైలట్స్, నేవిగేటర్స్, ఎయిర్‌మెన్ ఖాళీలను భర్తీ చేయనుంది.
AP TET 2024 Notification : ఏపీ టెట్ జూలై–2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ!
అర్హతలు
➤ పోస్ట్‌లను అనుసరించి ఎంపీసీ, ఇతర గ్రూప్‌లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత/నిర్దేశిత బ్రాంచ్‌లతో డిప్లొమా/ఒకేషనల్ ఇంటర్మీడియెట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
➤ సైన్స్ సబ్జెక్ట్స్‌కు అర్హతలు: కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఎంపీసీ) ఉత్తీర్ణత (లేదా) మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌లతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి (లేదా) మ్యాథ్స్, ఫిజిక్స్‌లు సబ్జెక్ట్‌లుగా రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల ఉత్తీర్ణత ఉండాలి.
➤ సైన్సేతర సబ్జెక్ట్స్‌కు అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (జనరల్, ఒకేషనల్) ఉత్తీర్ణులవ్వాలి.
➤ వయసు: 17 1/2 ఏళ్లు –21ఏళ్లు (అభ్యర్థులు జూలై 3, 2004–జనవరి 3, 2008 మధ్యలో జన్మించి ఉండాలి).
మూడు దశల ఎంపిక ప్రక్రియ
అగ్నివీర్ వాయు నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆయా పోస్ట్‌లకు అనుగుణంగా సైన్స్, సైన్సేతర సబ్జెక్ట్స్, సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ సైన్సేతర సబ్జెక్ట్‌ల పేరిట అర్హతలను, పరీక్ష విధానాన్ని నిర్ధారించారు.
TS CPGET 2024 Key: టీఎస్ సీపీజీఈటీ–2024 కీ విడుదల
తొలిదశ.. ఆన్‌లైన్ టెస్ట్
అగ్నివీర్ వాయు ఎంపిక ప్రక్రియలో తొలిదశలో భాగంగా ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన్ టెస్ట్ మూడు సబ్జెక్ట్‌ల అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది.
సైన్స్ సబ్జెక్ట్స్ టెస్ట్
సైన్స్ సబ్జెక్ట్స్‌లో నిర్వహించే పరీక్ష 60 నిమిషాల వ్యవధిలో 70 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
సైన్సేతర సబ్జెక్ట్స్‌కు పరీక్ష
ఈ విభాగానికి సంబంధించిన పరీక్ష 45 నిమిషాల వ్యవధిలో 50 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.
Hyderabad University : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంటెక్ కోర్సులో స్పాట్ అడ్మిషన్స్..
సైన్స్, సైన్సేతర సబ్జెక్ట్స్
ఈ విభాగం పరీక్ష 85 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. మూడు విభాగాల పరీక్షల్లో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్క్ నిబంధన విధించారు.
విభాగానికి అనుగుణంగా పరీక్ష
ఆయా విభాగాలకు అనుగుణంగా అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకే మూడు విధానాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే..టెక్నికల్ విభాగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు సైన్స్ సబ్జెక్ట్స్ పరీక్షకు, నాన్–టెక్నికల్ విభాగాల్లో చేరాలనుకునే వారు సైన్సేతర సబ్జెక్ట్ పరీక్షకు, ఈ రెండు విభాగాల్లోనూ చేరాలనుకుని తగిన అర్హతలున్న వారు సైన్స్,సైన్సేతర సబ్జెక్ట్ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది.
NEET UG 2024 Hearing Highlights: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రెండో దశ.. పీఎఫ్‌టీ–1
రెండో దశ ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్–1 పేరుతో శారీరక ద్రుఢత్వ పరీక్ష నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని ఏడు నిమిషాల్లో; మహిళా అభ్యర్థులు ఎనిమిది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.
మూడో దశ.. పీఎఫ్‌టీ–2
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్–1లో ఉత్తీర్ణత సాధించిన వారికి మూడో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్–2 ఉంటుంది. ఇందులో భాగంగా పలు ఫిజికల్ ఈవెంట్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 10 పుష్–అప్స్(1 నిమిషం వ్యవధి), 10 సిట్–అప్స్ (1 నిమిషం వ్యవధి), 20 స్క్వాట్స్ (1 నిమిషం వ్యవధి) చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 10 పుష్–అప్స్(1:30 నిమిషాల వ్యవధి), 15 స్క్వాట్స్ (1 నిమిషం వ్యవధి) తీయాల్సి ఉంటుంది.
అడాప్టబిలిటీ టెస్ట్
మూడు దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి చివరిగా అడాప్టబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఎయిర్‌ఫోర్స్‌లో, రక్షణ రంగంలో ఇమిడిపోయే లక్షణాలు అభ్యర్థుల్లో ఉన్నాయా లేదా అనేది ఈ టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ఇందులో భాగంగా సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ ఉంటుంది. అదే విధంగా అడాప్టబిలిటీ టెస్ట్–1లో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు. అడాప్టబిలిటీ టెస్ట్–2లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.
Gadikota Govt School: 129 మందికి ఒకటే మరుగుదొడ్డి
మెడికల్ ఎగ్జామ్
అడాప్టబిలిటీ టెస్ట్‌లోనూ విజయం సాధించిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ సానుకూల ఫలితం పొందితే..అగ్నివీర్ వాయుగా నియామకం ఖరారవుతుంది.
నాలుగేళ్లు విధులు
ఎంపిక ప్రక్రియలోని అన్ని దశల్లో విజయం సాధించి నియామకం పొందిన వారికి ఎయిర్‌ఫోర్స్‌లో నాలుగేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. వీరికి వేతనాలు, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు చొప్పున నెల వేతనం లభిస్తుంది. వేతనంలోంచి ప్రతి నెల 30 శాతం చొప్పున అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ 30 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తుంది. నాలుగేళ్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల కార్పస్ ఫండ్‌లో రూ.10.04 లక్షలు జమ అవుతాయి. వేతనంతోపాటు రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్‌లను కూడా అందిస్తారు. దీంతోపాటు నాన్–కంట్రిబ్యూటరీ జీవిత బీమా పేరుతో రూ.48 లక్షల మొత్తానికి జీవిత బీమా కల్పిస్తారు. అదేవిధంగా విధి నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే మరో రూ.44 లక్షల పరిహారం అందిస్తారు.
AGRICET 2024 Admissions : బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీలో ప్రవేశాలకు అగ్రిసెట్–2024.. ఈ విద్యార్థులు మాత్రమే అర్హులు..
స్కిల్ సర్టిఫికెట్
నాలుగేళ్లపాటు విధులు పూర్తి చేసుకున్న వారికి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువ పత్రం అందజేస్తారు. ఫలితంగా అభ్యర్థులు ఆ తర్వాత ఇతర అవకాశాలను ముఖ్యంగా.. ప్రైవేట్,ప్రభుత్వ రంగా ల్లో సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలు అందుకోవడంలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.
విధులు ఇలా
అగ్నివీర్–వాయుగా నియమితులైన వారు టెక్నికల్, నాన్–టెక్నికల్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎయిర్‌మెన్ హోదాకు ఎంపికైన వారు.. ఎయిర్‌మెన్ గ్రూప్–ఎక్స్ పరిధిలో ఎయిర్‌ఫోర్స్‌లోని టెక్నికల్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గ్రూప్–వై పరిధిలో నాన్–టెక్నికల్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. నేవిగేటర్‌గా ఎంపికైన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫ్లయింగ్ విభాగం, గ్రౌండ్ డ్యూటీ విభాగాల మధ్య సమన్వయం చేస్తూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పైలట్‌గా నియమితులైన వారు యుద్ధ విమానాలు, వైమానిక దళానికి చెందిన ఇతర ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను నడపాల్సి ఉంటుంది. కమిషన్డ్ ఆఫీసర్ హోదాలో నియమితులైన వారికి..ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్,వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్,గ్రూప్ కెప్టెన్ వంటి హోదాలు లభిస్తాయి.
Admissions Notification 2024 : అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల..
ముఖ్య సమాచారం
→ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
→ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 28.07.2024
→ ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 18.10.2024
→ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: జ్టి్టpట://్చజnజీp్చ్టజిఠ్చిyu.ఛిఛ్చీఛి.జీn
రాత పరీక్షలో రాణించేలా
➤ ఇంగ్లిష్‌లో బేసిక్ గ్రామర్, ప్రిపొజిషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్,ప్యాసివ్ వాయిస్,ప్యాసేజ్ కాంప్రహెన్ష న్,డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వెర్బ్స్,టెన్సెస్, పంక్చుయేషన్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌లపై పట్టు సాధించాలి.
➤ సైన్స్ కోసం ఇంటర్మీడియెట్ స్థాయిలోని కైనమాటిక్స్, వర్క్, ఎనర్జీ చలన నియమాలు, మెకానిక్స్, హీట్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, వేవ్స్, సెమీ కండక్టర్స్ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
➤ మ్యాథమెటిక్స్‌లో.. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, సమితులు, ప్రమేయాలు, ట్రిగ్నోమెట్రీ, స్ట్రెయిట్ లైన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వెక్టార్స్, స్టాటిస్టిక్స్, 3–డి జామెట్రీ, డిఫరెన్షియేషన్స్, డెరివేటివ్స్, అల్జీబ్రా వంటి ఇంటర్మీడియెట్ స్థాయిలోని గణిత అంశాలపై సన్నద్ధత పొందాలి.
➤ జనరల్ అవేర్‌నెస్: అభ్యర్థులకున్న సామాజిక అవగాహనను పరీక్షించే విభాగం ఇది. ఇందులో రాణించడానికి కరెంట్ అఫైర్స్‌పై ఎక్కువ శ్రద్ధ చూపాలి. అదే విధంగా భారతదేశ చరిత్ర, భౌగోళిక అంశాలు, పోర్ట్‌లు, తీర ప్రాంతాలు, ముఖ్యమైన వ్యక్తులు, సదస్సులు, క్రీడలు–విజేతలు, రక్షణ రంగానికి సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన పొందాలి.
Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగం
Tags
- agniveer vayu notification
- Indian Airforce
- online applications
- online exam
- job recruitment
- Agnipath scheme
- jobs at airforce
- Eligible Candidates
- inter and diploma students
- Education News
- Agniveer-Vayu Recruitment
- Indian Air Force Agniveer-Vayu
- Agniveer-Vayu 2/2025
- Agniveer-Vayu Career Opportunities
- IAF Selection Process
- Agniveer-Vayu Preparation
- Air Force Careers
- Agniveer-Vayu Training Program
- Indian Air Force jobs
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024