AP TET 2024 Notification : ఏపీ టెట్ జూలై–2024 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ!
ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పేపర్–1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్–1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు,పేపర్–2ఏ స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్–2బీ ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతుల బోధనకు పేపర్–1(ఎ, బి), 6 నుంచి 8 తరగతుల బోధనకు పేపర్–2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
» అర్హత: పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతోపాటు డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు అర్హులే.
» పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. పరీక్షలో పేపర్–1 ఏ, పేపర్–1 బి ఐదు విభాగాల్లో 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటుంది. పేపర్–2 ఏ, పేపర్–2బి నాలుగు విభాగాల్లో మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 03.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.08.2024.
» దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 నుంచి 03.08.2024 వరకు
» హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేది: 22.09.2024.
» పరీక్షల తేదీలు: 03.10.2024 నుంచి 20.10.2024 వరకు
» ఫలితాల ప్రకటన తేది: 02.11.2024.
» వెబ్‌సైట్: https://aptet.apcfss.in
Hyderabad University : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఎంటెక్ కోర్సులో స్పాట్ అడ్మిషన్స్..
Tags
- AP TET 2024 Notification
- online applications
- hall ticket download
- tet exam applications
- Teacher Recruitment Test
- DSC
- Teacher jobs
- Eligible Candidates
- TET exam dates
- tet results 2024
- Education News
- Sakshi Education News
- Important Dates
- exam centers
- exam schedule
- Eligibility Criteria
- AP TET Application
- Teacher Eligibility Test
- AP TET July 2024
- AP TET Paper-1 Qualification
- AP TET Paper-2 Qualification
- AP TET Classes 1 to 5
- AP TET Classes 6 to 8
- Andhra Pradesh TET 2024
- SakshiEducationUpdates