Skip to main content

AGRICET 2024 Notification : బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాలకు అగ్రిసెట్‌–2024.. ఇందుకు అర్హులు!

గుంటూరులోని ఆచార్య ఎన్‌ జీ రంగా అగికల్చరల్‌ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ డిగ్రీలో ప్రవేశాలకు అగ్రిసెట్‌–2024 నిర్వహిస్తారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
AGRICET 2024 entrance exam for admissions at B Sc Agriculture  AGRISET-2024 announcement for B.Sc Agriculture  Eligibility for AGRISET-2024: Polytechnic Diploma holders   Apply for B.Sc Agriculture at ANGRAU via AGRISET-2024  B.Sc Agriculture admissions 2024-25 at ANGRAU Guntur

»    కోర్సు వివరాలు: బీఎస్సీ(ఆనర్స్‌).
»    అర్హత: అభ్యర్థులు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ/ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ /ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో రెండేళ్ల డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 31.12.2024 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: ఇంటర్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) విధానంలో జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. పరీక్ష కాలవ్యవధి 1 గంట 30 నిమిషాలు.

Skill Development Centers: రూ.300 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కన్వీనర్, అగ్రిసెట్‌–2024, ది అసోసియేట్‌ డీన్, ఎస్‌ వీ అగ్రికల్చరల్‌ కాలేజ్, తిరుపతి–517502, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
»    పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురము, కర్నూల్, వైఎస్సార్‌ కడప.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
»    ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.08.2024.
»    ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రారంభతేది: 01.08.2024.
»    ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 05.08.2024.
»    హాల్‌టికెట్‌ల డౌన్‌లోడ్‌ తేదీ: 16.08.2024 నుంచి 23.08.2024 వరకు.
»    పరీక్ష తేది: 27.08.2024.
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://angrau.ac.in

Apprentice Posts at IFFCO : ఐఎఫ్‌సీసీవోలో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ అప్రెంటిస్‌లు.. అర్హ‌త వీరికే!

Published date : 18 Jul 2024 08:58AM

Photo Stories