Collector Koya Sriharsha: బోధన ఎలా ఉంది.. భోజనం బాగుంటుందా..
జూలై 26న అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాలరక్షభవన్, సఖికేంద్రం, రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్ (ఆర్‌బీఎస్)ను సందర్శించి సౌకర్యాలపై ఆరా తీశారు.
అయితే ఈ స్కూల్‌కు సొంత భవనం లేక సోషల్ వెల్ఫేర్‌కు చెందిన ఇరుకుగదుల్లో ఉండాల్సి వస్తోందని, పై స్లాబ్ కురుస్తోందని తెలుసుకున్న కలెక్టర్ అప్పటికప్పుడే సంబంధిత అధికారులను రప్పించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు.
చదవండి: Schools are Closed: బడులు మూత.. విద్యార్థుల గోస
అంగన్‌వాడీలో సేవలెలా ఉన్నాయ్
అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలెలా అందుతున్నాయ్.. ప్రీ స్కూల్ ప్రోగ్రాం అమలవుతోందా.. గర్భిణులు వచ్చి పోషకాహారం తీసుకుంటున్నారా అని కలెక్టర్ శ్రీహర్ష జిల్లా సంక్షేమశాఖ అధికారి రవుఫ్‌ఖాన్, సీడీపీవో కవితను అడిగి తెలుసుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలన్నీ పది రోజుల్లోగా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బరు వు తక్కువ చిన్నారులు, రక్తహీనతతో ఉన్న గ ర్భిణులను గుర్తించి ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించి సేవలందేలా చూడాలని సూచించారు.
బాలరక్ష భవన్‌లో..
బాలరక్షభవన్‌ను సందర్శించిన కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. భ వన్ నుంచి చేపట్టే హోం విజిట్ వివరాలు తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యాలయ రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో నమెదు కావాలన్నారు.
సఖీ కేంద్ర సేవలపై ప్రచారం చేయాలి
సఖీ కేంద్రం ద్వారా అందే సేవలపై సోషల్‌మీ డియాలో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సఖీ నూతన భవనాన్ని పరిశీలించి అసంపూర్తి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
వైద్యులు సకాలంలో విధులకు రావాలి
ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావా లని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో మాతా శిశు ఆసుపత్రుల నిర్వహణ తీరుపై స మీక్షించారు.
పెద్దపల్లి ఆసుపత్రిలో 200, సుల్తానాబాద్, మంథని ఆసుపత్రుల్లో 50 చొప్పున ప్రసవాల లక్ష్యం నిర్ధేశించుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్, ఆసుపత్రుల సూపరింటెండెంట్ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.