Funds to Govt Schools : జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు నిధుల కేటాయింపు..
రాయచోటి: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలోని 30 మండలాల పరిధిలో ఉన్న 2112 పాఠశాలలకు 4 కోట్ల 59 లక్షల 45 వేల రూపాయల నిధులను కేటాయించింది. ఈ మేరకు ఈనెల 23వ తేదీన 50 శాతం నిధులను విడుదల చేస్తూ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. ఈ నిధులను పాఠశాలల నిర్వహణ ఖర్చులకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 50 శాతం నిధుల కింద 2 కోట్ల 29 లక్షల 725 రూపాయల మంజూరుకు ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. రెండు, మూడు రోజుల్లో నిధులు సంబంధిత పాఠశాలల యాజమాన్య సంఘాల ఖాతాలకు జమ అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Job Mela: గుడ్‌న్యూస్.. టెన్త్ అర్హతతో జాబ్‌మేళా
ఎమ్మార్సీలకు రూ.39లక్షలు..
జిల్లాలో 2112 పాఠశాలలతో పాటు మండల కేంద్రాల్లో ఉన్న ఎమ్మార్సీల నిర్వహణకు ఒక్కొక్క ఎమ్మార్సీకి ఒక లక్షా 30 వేల రూపాయల వంతున రూ.39 లక్షలను విడుదల చేసింది. ఇందులో బోధనోపకరణాల తయారీ రూ.30 వేలు, టీఎల్‌ఈ, టీఎల్‌ఎం లకు రూ.30 వేలు, సమావేశాలు, రవాణా ఖర్చులకు రూ.30 వేలు, స్టేషనరీ, మైనర్ రిపేర్లకు రూ.40 వేల వంతున రూ.1.30 లక్షలు మంజూరు చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
మంజూరు ఇలా..
జిల్లాలోని పాఠశాలల వనరుల అభివృద్ధికి గుణాత్మక విద్య పెంపొందించడానికి పాఠశాలలకు కాంపోజిట్ నిధులను సమగ్ర శిక్షణ నుంచి మంజూరు చేస్తుంటారు. వీటితో పాటు పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, చిన్న చిన్న మరమ్మతులు, విద్యార్థుల్లో గుణాత్మక విద్య పెంపొందించడానికి అవసరం అయిన బోధనోపకరణాల తయారీ తదితరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు.
Digital Technology : డిజిటల్ టెక్నాలజీపై మహిళా వర్సిటీలో మూడు రోజుల శిక్షణ
పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి నిధులను మంజూరు చేశారు. పీఎం శ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాలు, జూనియర్ కళాశాలలు, వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ప్రస్తుతం ఈ నిధుల నుంచి మినహాయించారు. వాటికి అవసరమైన నిధులను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించనుంది.
Tags
- Govt Schools
- funds released
- schools development
- students education
- PM Shri Scheme in AP
- education schemes in ap
- Qualitative Education
- Schools
- KGBV Schools
- junior colleges
- basic facilities in schools
- annamayya district govt schools
- District Education Office
- Education News
- Sakshi Education News
- Rayachoti
- AnnamaiyaDistrict
- PublicSchools
- EducationSupport
- FinancialAssistance