10th Class: నేటి నుంచి ఎస్‌ఎస్‌సీ స్పాట్

కరీంనగర్: పదో తరగతి పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు విద్యాశాఖ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని డీఈవో జనార్దన్‌రావుతోపాటు పలువురు అధికారులు బుధవారం సందర్శించారు. ఎలాంటి ఇక్కట్లు లేకుండా స్పాట్ కొనసాగేందుకు సిబ్బందికి దిశానిర్దేశనం చేశారు. నేటి నుంచి ఈనెల 21వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నారు.
Also read: Top 10 Current Affairs in Telugu: ఏప్రిల్ 11, టాప్ - 10 కరెంట్ అఫైర్స్
- మరోవైపు పది పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో స్పాట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ ఉపాధ్యాయుడు విధిగా గుర్తింపు కార్డు (ఐడీకార్డు)తో రావాలని, మాస్క్ ధరించాలని, ఎవరు కూడా సెల్‌ఫోన్లు వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు.
- ఉపాధ్యాయులంతా ఉదయం ఎనిమిది గంటలకు క్యాంపు ఇన్‌చార్జికి రిపోర్టు చేయాలి. వారికి ఏసీవోలు ఒక్కొక్కరికి ఉదయం 20 పేపర్ల జవాబుపత్రాలు ఇచ్చి వాటిని రిటర్న్ చేసిన తర్వాత మధ్యాహ్నం 20 పేపర్ల జవాబుపత్రాలను మూల్యాంకనం కోసం ఇస్తారు. సాయంత్రం 5 గంటల వరకు వాటిని తిరిగి ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది.
Also read: ‘గురుకుల’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
- టీచర్స్ ఇతరులతో కలిసి వేరే గదుల్లోకి వెళ్లకూడదని.. నిబంధనలు పాటించని ఉపాధ్యాయులపై 25 యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- సెయింట్ జాన్స్ స్కూల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 2,35,333 జవాబు పత్రాల మూల్యాంకనం జరగనుంది.
- డీఈవో క్యాంపు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిది మంది సీనియర్ ఉపాధ్యాయులను ఏసీవోలుగా నియమించారు. వీరి ఆధ్వర్యంలో 1,250 మంది ఉపాధ్యాయులు వారివారి సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారు.
మొదటి రోజు..
గురువారం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక శాస్త్రం సబ్జెక్టుల జవాబుపత్రాలు మూల్యాంకనం ప్రారంభమవుతాయి. జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు ఈ నెల14 నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుంది. జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రాలకు వచ్చే చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మూల్యాంకనంలో పాల్గొంటారు.
Also read: March 2023 Top 30 Current Affairs Bits in Telugu | APPSC | TSPSC | Police | UPSC