రేపు ‘TET’.. పేపర్–1.. పేపర్–2కు ఇంత మంది అభ్యర్థులు..
ఇప్పటికే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసి వాటిలో వసతులు సమకూర్చారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను ఎంపిక చేసి వారికి డ్యూటీ ఆర్డర్లు జారీ చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నామని డీఈవో జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.
పేపర్–1కు 5,973.. పేపర్–2కు 5,369 మంది..
టెట్‌కు జిల్లాలో 11,342 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 15న పేపర్–1 పరీక్షను ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు నిర్వహించనుండగా 5,973 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికి జగిత్యాల పట్టణంలోనే 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పేపర్–2 పరీక్షను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనుండగా 5,369 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికి జగిత్యాల పట్టణంలోనే 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు పేర్కొన్నారు.
చదవండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్..
ఇన్విజిలేటర్లుగా విద్యాశాఖేతర అధికారులు
15న టెట్ నిర్వహించనుండటంతో ఇన్విజిలేటర్లుగా విద్యాశాఖేతర అధికారులకు డ్యూటీలు కేటాయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పరీక్షలకు 300 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాలకు 25 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 25 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 125 మంది హాల్ సూపరింటెండెంట్‌లను నియమించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో పేర్కొన్నారు.