Great Scholarship: బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 'గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2024'
![Great scholarships to study in UK Scholarship Application Form Great Scholarships 2024](/sites/default/files/images/2024/02/14/great-scholarships-uk-1707901942.jpg)
హైదరాబాద్, ఫిబ్రవరి 2024: బ్రిటీష్ కౌన్సిల్ అనేది యూకేలో విద్యావకాశాలు, సాంస్కృతిక సంబంధాల కోసం ఉన్న అంతర్జాతీయ సంస్థ. ఇది యూకే ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2024 ప్రకటించింది. భారత్‌లోని విద్యార్థులకు ఈ గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2024 నుంచి యూకేలో వివిధ అధ్యయన రంగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలను చేపట్టే అవకాశాన్ని కల్పించనుంది.
Short-Term Courses: డిగ్రీ విద్యార్థులకు ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ
యూకేలోని 25 విశ్వవిద్యాలయాలు ఈ సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ విద్యార్థులకు 26 పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రేట్ స్కాలర్‌షిప్‌లు కలవు. అందులో ఫైనాన్స్, మార్కెటింగ్, బిజినెస్, సైకాలజీ డిజైన్, హ్యుమానిటీస్, డ్యాన్స్ తదితర ఉన్నాయి. ప్రతి స్కాలర్‌షిప్ కనీసం పది వేల పౌండ్లు కలదు. ఇది యూకేలో 2024-25 విద్యా సంవత్సరానికి ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం ట్యూషన్ ఫీజు కింద చెల్లించనున్నారు.
JEE Mains Results: జేఈఈ మేయిన్స్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు వీరే..
గ్రేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024లో న్యాయ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో భారతీయ విద్యార్థులకు న్యాయం, న్యాయ అధ్యయనాల కోసం రెండు స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు చట్టపరమైన రంగంలో అత్యుత్తమ కార్యక్రమాలను అందించే రెండు ఉన్నత విద్యా సంస్థలలో అందించబడతాయి. మానవ హక్కులు, ఆస్తి చట్టం, నేర న్యాయం, వాణిజ్య చట్టం తదితర వివిధ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి ఉన్న భారతీయ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Good News for Women: మహిళలకు గుడ్‌న్యూస్ అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అదనంగా 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగు యూకే విశ్వవిద్యాలయాలలో సైన్స్, టెక్నాలజీ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సస్టైనబుల్ ఇంజినీరింగ్, సైకాలజీ వంటి వివిధ రకాల సైన్స్, టెక్నాలజీ సబ్జెక్టులను కవర్ చేసే కోర్సుల కోసం భారతీయ విద్యార్థులు ఏదైనా ఉన్నత విద్యా సంస్థలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
Admissions in NAARM: నార్మ్‌లో పీజీడీఎం కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
గ్రేట్ స్కాలర్‌షిప్‌లు భారతదేశంలో యూకే విద్యను విస్తృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రతి సంవత్సరం 133,237 మంది భారతీయ విద్యార్థులు యూకేలో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్రేట్ స్కాలర్‌షిప్‌లు యూకే, భారతదేశం మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడంతో పాటు యూకేకు భారతీయ విద్యార్థులను ఆహ్వానించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనే విశ్వవిద్యాలయాలలో ఒకదాని నుంచి ఎంట్రీ ఆఫర్‌ను పొంది ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం పేర్కొన్న విధంగా కోర్సు కోసం అన్ని ప్రవేశ అవసరాలను తప్పనిసరిగా తీర్చాలి.
https://www.britishcouncil.in/study-uk/scholarships/great-scholarships