Degree Graduates: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ
Sakshi Education
తమ చదువు పూర్తవగానే ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర నైపున్యాభివృద్ధి..
సాక్షి ఎడ్యుకేషన్: డిగ్రీ విద్యార్థులు తమ చదువు పూర్తవగానే ఉద్యోగ అవకాశాలు పొందేలా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 9 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు.
JEE Mains Results: జేఈఈ మేయిన్స్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు వీరే..
కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్, అమెజాన్‌వెబ్ సర్వీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, డిజిటల్ మార్కెటింగ్, ట్యాలీ, హార్డ్‌వేర్, పైతాన్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ నెల 5 నుంచి 13 ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించామని, 1000 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Published date : 14 Feb 2024 11:44AM