JEE Mains Results: జేఈఈ మేయిన్స్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు వీరే..
సాక్షి ఎడ్యుకేషన్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2024 ఫేజ్–1 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రైతు పాలగిరి లక్ష్మీరెడ్డి కుమారుడు పాలగిరి సతీష్‌రెడ్డి 99.99 పర్సంటైల్ సాధించాడు. అలాగే అనంతపురం నగరానికి చెందిన బి.షేక్ ముజమ్మిల్ 99.96 పర్సంటైల్ సాధించాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులు నజ్హత్ కౌసర్, కలీముల్లాలు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
Admissions in NAARM: నార్మ్‌లో పీజీడీఎం కోర్సులో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
వీరితో పాటు అనంతపురం నగరానికి చెందిన విద్యార్థులు శశికిరణ్ 99.89 పర్సంటైల్, చిగిచెర్ల మేఘన 99.64, పటాన్ ఆసింఖాన్ 99.23, మంగతి నవదీప్ 99.08, గంపల హరిచాణిక్య రెడ్డి 98.88, మన్నెపూరి సిద్ధార్థరెడ్డి 97.85, పొరకల శివప్రసాద్ 97.70, పట్నం భానుప్రకాష్ 97.45, కె.సీతారామచరణ్ 97.27, రాయపాటి వంశీకృష్ణారెడ్డి 97.23, ములకల అమృత్ 97.05, కప్పెత అజయ్‌కృష్ణారెడ్డి 96.79, కురబ శివసాయితేజ 96.52, బి.అనురిద్ 96.45, కూచి అరవింద్ 96.44, ఉస్తిలి మోహిత్‌కుమార్‌రెడ్డి 96.10, తలుపుల ప్రశాంతి 95.37, నాపా మహర్షి 95.30, పొన్నపాటి వినీల 95.26, జయం షణ్ముఖ శివాన్విత 95.25 పర్సంటైల్ సాధించారు.
ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11.70 లక్షలమంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.40 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు.
చక్రధర్‌రెడ్డి మెరుపులు
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తాడిపత్రికి చెందిన సంగటి చక్రధర్‌రెడ్డి మెరిశాడు. 99.91 పర్సంటైల్ సాధించి పలువురితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరీ సంతోషం వ్యక్తం చేశారు.