నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు యూకే వెల్‌కమ్...!
Sakshi Education
భారత్‌లోని నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు భారీగా ఉద్యోగ అవకాశాల కల్పనకు యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే) సిద్ధమైంది. 2018 మార్చి నాటికి.. 5 వేల మంది నర్సులను నియమించుకొనేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి యూకే అందిస్తున్న తాజా అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు మార్గాలపై విశ్లేషణ..
బ్రిటన్ ఆరోగ్య రంగంలో నైపుణ్యమున్న నర్సుల కొరత ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా బ్రెగ్జిట్ అనంతర పరిణామాలతో సమస్య మరింత పెరిగింది. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి వచ్చే నర్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది. యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) అంచనాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 40 వేల మంది నర్సుల కొరత ఉంది. ఈ సమస్యపై ఇటీవల యూకే పార్లమెంటులో సైతం చర్చ జరిగింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా విదేశాల నుంచి నర్సింగ్ గ్రాడ్యుయేట్లను తక్షణం నియమించుకునేందుకు కార్యాచరణను ప్రభుత్వం సిద్ధంచేసింది.
భారత్, ఫిలిప్పీన్స్ నుంచి 5,500...
నర్సింగ్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే క్రమంలో బ్రిటన్ ముందుగా భారత్, ఫిలిప్పీన్స్ దేశాలపై దృష్టి సారించింది. 2018 మార్చి చివరి నాటికి ఈ రెండు దేశాల నుంచి 5,500 మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఇతర నాన్-ఈయూ దేశాలతో పోల్చితే.. భారత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన వారే మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో నర్సుల కొరత సమస్యకు తక్షణ పరిష్కారం ఈ రెండు దేశాల నుంచి లభిస్తుందనే భావన యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ వర్గాల్లో నెలకొంది. వాస్తవానికి విదేశీ నర్సింగ్ ప్రొఫెషనల్స్ కోణంలో యూకేకు భారత్ రెండో పెద్ద దేశంగా మారింది. 2009-16 మధ్య కాలంలో దాదాపు ఎనిమిది వేల మంది భారత నర్సింగ్ గ్రాడ్యుయేట్లు యూకేలో వర్క్ వీసాలు పొందారు.
అర్హత నిబంధనల్లో సడలింపు?
యూకేలో ఎలాంటి ఉద్యోగం చేయాలనుకున్న వారైనా.. తప్పనిసరిగా కొన్ని ప్రామాణిక పరీక్షల్లో విజయం సాధించాలి. ప్రధానంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యం పరంగా ఐఈఎల్‌టీఎస్ స్కోర్ బ్యాండ్ 6.5గా ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఐఈఎల్‌టీఎస్ కనీస స్కోర్ నుంచి కొంతమేర సడలింపు ఇచ్చే అవకాశముంది. ఐఈఎల్‌టీఎస్ నుంచి మినహాయింపునిచ్చి.. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన ఆక్యుపేషనల్ ఇంగ్లిష్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సరిపోతుందనే విధంగా నిబంధనల్లో మార్పుచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తేలిగ్గా వీసా మంజూరు...
నర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే భారత్, ఫిలిప్పీన్స్ అభ్యర్థుల విషయంలో వీసా నిబంధనలను కొంతమేర సడలించే అవకాశం కనిపిస్తోంది. వీసా దరఖాస్తు సమయంలో నిర్వహించే ఇంటర్వ్యూల నుంచి సడలింపు ఇచ్చే విషయంపైనా బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. తమ దేశంలో ఉద్యోగానికి వచ్చే అభ్యర్థులు అయిదేళ్ల తర్వాత స్వదేశానికి వెళ్లే విధంగా రిటన్ పాలసీ పేరుతో బ్రిటన్‌లో నిబంధనలు అమలవుతున్నాయి. అయిదేళ్లు పూర్తయ్యాక అక్కడే మరో ఉద్యోగం లభిస్తే.. దాన్ని పొడిగించే వీలుంది. నర్సింగ్ నిపుణుల విషయంలో రిటన్ పాలసీని సైతం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అర్హతలు...
యూకే నర్సింగ్ ఉద్యోగాలను సొంతం చేసుకునేందుకు అర్హతలు..
బ్రిటన్‌లో నర్సింగ్ ఉద్యోగా లను ఆశించే అభ్యర్థులు.. ముందుగా అక్కడి నియంత్రణ సంస్థ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆపై 20 రోజుల పాటు లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో చేరాలి. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకే వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఎన్‌ఎంసీ ఉత్తీర్ణత :
నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులను.. శిక్షణకు ఎంపిక చేసేముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. అడల్ట్ నర్సింగ్, చిల్డ్రన్ నర్సింగ్, లెర్నింగ్ డిజేబిలిటీస్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, మిడ్‌వైఫరీ అంశాల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్లో జరుగుతుంది.
స్పాన్సర్ తప్పనిసరి..
భారీ స్థాయిలో భారత నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించనున్నప్పటికీ.. అభ్యర్థులు స్పాన్సరర్ (ఎంప్లాయర్) ఇచ్చే స్పాన్సర్‌షిప్ లెటర్ పొందడం తప్పనిసరి. ఇది ఉంటేనే యూకేలో అడుగుపెట్టేందుకు.. నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో నమోదుకు అవకాశం లభిస్తుంది. స్పాన్సర్‌షిప్ లెటర్ పొందిన అభ్యర్థులు టైర్-2 కేటగిరీలో వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆకర్షణీయ వేతనాలు..
ఎంట్రీ లెవల్‌లో 15 వేల పౌండ్లు, రెండుమూడేళ్ల అనుభవం ఉంటే 24 వేల పౌండ్ల వార్షిక వేతనం లభిస్తోంది. వేతనానికి అదనంగా నివాస సదుపాయం, సోషల్ సెక్యూరిటీ, సెలవు రోజుల్లో పనిచేస్తే రెట్టింపు జీతం వంటివి కూడా ఇచ్చే విధానం అమలవుతోంది.
ప్రధాన ఉపాధి వేదికలు...
1. www.nmc.org.uk
2. www.healthcareers.nhs.uk
3. www.nhs.uk

- బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సుల్లో ఉత్తీర్ణత.
- ఒకటిరెండేళ్ల అనుభవం ఉంటే ప్రాధాన్యం లభిస్తుంది.
- అభ్యర్థులు తమ దేశంలోని అకడమిక్ నియంత్రణ సంస్థల్లో పేర్లు నమోదు చేసుకుని ఉండాలి.
బ్రిటన్‌లో నర్సింగ్ ఉద్యోగా లను ఆశించే అభ్యర్థులు.. ముందుగా అక్కడి నియంత్రణ సంస్థ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆపై 20 రోజుల పాటు లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో చేరాలి. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకే వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఎన్‌ఎంసీ ఉత్తీర్ణత :
నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థులను.. శిక్షణకు ఎంపిక చేసేముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. అడల్ట్ నర్సింగ్, చిల్డ్రన్ నర్సింగ్, లెర్నింగ్ డిజేబిలిటీస్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, మిడ్‌వైఫరీ అంశాల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్ష ఆన్‌లైన్లో జరుగుతుంది.
స్పాన్సర్ తప్పనిసరి..
భారీ స్థాయిలో భారత నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు కల్పించనున్నప్పటికీ.. అభ్యర్థులు స్పాన్సరర్ (ఎంప్లాయర్) ఇచ్చే స్పాన్సర్‌షిప్ లెటర్ పొందడం తప్పనిసరి. ఇది ఉంటేనే యూకేలో అడుగుపెట్టేందుకు.. నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో నమోదుకు అవకాశం లభిస్తుంది. స్పాన్సర్‌షిప్ లెటర్ పొందిన అభ్యర్థులు టైర్-2 కేటగిరీలో వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆకర్షణీయ వేతనాలు..
ఎంట్రీ లెవల్‌లో 15 వేల పౌండ్లు, రెండుమూడేళ్ల అనుభవం ఉంటే 24 వేల పౌండ్ల వార్షిక వేతనం లభిస్తోంది. వేతనానికి అదనంగా నివాస సదుపాయం, సోషల్ సెక్యూరిటీ, సెలవు రోజుల్లో పనిచేస్తే రెట్టింపు జీతం వంటివి కూడా ఇచ్చే విధానం అమలవుతోంది.
ప్రధాన ఉపాధి వేదికలు...
- హాస్పిటల్స్
- మెంటల్ హెల్త్ కేర్ సెంటర్స్
- రిహాబిలిటేషన్ సెంటర్స్
- చైల్డ్ కేర్ సెంటర్స్
- అడల్ట్ కేర్ సెంటర్స్
- నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్
- బిటన్‌లో 40 వేలమంది నర్సింగ్ సిబ్బంది కొరత.
- అడల్ట్ పేషెంట్స్ కేర్ విభాగంలో 22 వేల మంది కొరత.
- ఇతర విభాగాల్లో 18 వేల మంది కొరత.
- 2020 నాటికి 70 వేలకు పైగా పెరగనున్న నర్సుల కొరత.
1. www.nmc.org.uk
2. www.healthcareers.nhs.uk
3. www.nhs.uk
Published date : 09 Dec 2017 05:04PM