Gurukula 2000 Backlog Jobs 2024 : 2000 బ్యాక్‌లాగ్ పోస్టులు.. వీటిని కొత్త నోటిఫికేషన్‌లో..!
రీలింక్విష్‌మెంట్ విధానం లేకుండానే గురుకుల పోస్టులన్నీ భర్తీ చేసేందుకే సర్కారు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అనుమతి పొందినా భర్తీచేయని పోస్టులతోపాటు, తాజా భర్తీలో బ్యాక్‌లాగ్‌గా పోస్టులన్నింటినీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను..
ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల డిమాండ్‌పై సర్కారు మౌనం వహిస్తున్నదని విద్యావేత్తలు తేల్చి చెప్తున్నారు. అదీగాక ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే ఆయా సొసైటీలు ట్రిబ్ కొత్తగా అలాట్ చేసిన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 క్యాటగిరీల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులు కలిపి మొత్తంగా 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్) చేపట్టింది.
అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా..
ఇప్పటికే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి 1:1 జాబితాలను సైతం ప్రకటించింది. గత ఫిబ్రవరిలోనే ఆయా అభ్యర్థులను సొసైటీల వారీగా కేటాయిస్తూ ఎల్బీ స్టేడియం వేదికగా అలాట్‌మెంట్ ఆర్డర్లను అందజేసింది. దీనిపై 1:2 జాబితాలోని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రీలిక్విష్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని పలువురు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు.
ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్‌లాగ్‌కు వెళ్లే అవకాశం ఉండదు. కానీ..
రీలింక్విష్‌మెంట్ విధానం అంటే.. గురుకులాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీతకాలం వరకు ఉద్యోగాన్ని వదిలిపోబోమని, ఒకవేళ అదే జరిగితే ఆ ఉద్యోగాన్ని మెరిట్ జాబితాలో ఉన్న తర్వాతి అభ్యర్థికి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఒప్పందపత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేయాలి. ఫలితంగా ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్‌లాగ్‌కు వెళ్లే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుతం ట్రిబ్ ఆ విధానాన్ని అమలు చేయకుండానే పోస్టుల భర్తీని చేపట్టడమే అసలు వివాదానికి తావిస్తున్నది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టింగులు ఇచ్చేందుకు ఆయా సొసైటీలు కసరత్తు చేస్తుండటం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది.
వీటిని కొత్త నోటిఫికేషన్ ద్వారానే..
ప్రస్తుత నియామకాల్లో మిగిలే పోస్టులన్నింటినీ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నదని విద్యావేత్తలు, పలువురు గురుకుల అభ్యర్థులు నొక్కి చెప్తున్నారు. ప్రస్తుతం నోటిఫై చేసిన 9,210 పోస్టుల్లో ఇప్పటివరకు 8,708 పోస్టుల ఎంపిక ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. అందులో కూడా 8,304 పోస్టులనే ట్రిబ్ భర్తీ చేసింది. 404 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరని చెప్పి భర్తీ చేయలేదు. అదీగాక రీలింక్విష్‌మెంట్ విధానం లేకపోవడం, కామన్ పేపర్ పెట్టడం, డిసెండింగ్ ఆర్డర్‌ను అంటే పైనుంచి కిందికి వరుస క్రమంలో నింపకపోవడం వల్ల ప్రస్తుతం భర్తీ చేసిన పోస్టుల్లోనూ దాదాపు 1,500 నుంచి 2,000 పోస్టుల వరకు బ్యాక్‌లాగ్‌లో పడిపోయే అవకాశం ఉన్నది. దీనిని ఒకే అభ్యర్థి వివిధ క్యాడర్ పోస్టులకు ఎంపిక కావడమే కారణమని అభ్యర్థులు వివరిస్తున్నారు.
మొత్తంగా 10,675 పోస్టులను భర్తీచేయాల్సి ఉండగా..
బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు గురుకులంలో మంజూరై భర్తీచేయని పోస్టులు కూడా ఉన్నాయి. వాస్తవంగా అన్ని గురుకులాల కోసం ప్రభుత్వం తొలుత 11,687 పోస్టులను మంజూరు చేసింది. అందులో 10,675 పోస్టులు బోధన సిబ్బంది కాగా, మిగిలినవి 1,012 బోధనేతర పోస్టులు ఉన్నాయి. బోధన సిబ్బంది పోస్టులను ట్రిబ్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. మొత్తంగా 10,675 పోస్టులను భర్తీచేయాల్సి ఉండగా, అందులో తొలిదఫాగా 9,210 పోస్టుల భర్తీకి మాత్రమే ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
సర్వీస్ రూల్స్, న్యాయ వివాదాల్లో ఉన్న 1,465 పోస్టుల భర్తీని రెండో విడతలో చేపట్టాలని గతంలోనే నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న ఈ 1,465 పోస్టులనూ బ్యాక్‌లాగ్ పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసి తమ ఖాతాలో వేసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు విద్యావేత్తలే చెప్తున్నారు. ట్రిబ్ సైతం నోటిఫికేషన్‌లోని పేరా 5(1)లో జీవో 81, 1997 ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదని, భర్తీ కాని, అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారిఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని ఇప్పటికే ఒకసారి ప్రతికా ముఖంగానే తేల్చిచెప్పింది. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరిస్తున్నారు.
☛ Telangana 2 Lakh Government Jobs 2024 : ఈ ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామిలా..
Tags
- ts gurukulam jobs 2024 updates
- telangana gurukula back backlog jobs 2024
- telangana gurukula back backlog jobs 2024 news telugu
- telugu news telangana gurukula back backlog jobs 2024
- telangana 2000gurukula back backlog jobs 2024
- telangana 2000 gurukula back backlog jobs 2024 news telugu
- ts 2000 backlog jobs news telugu
- ts gurukulam 2000 backlog jobs news telugu
- ts 2000 backlog jobs gurukulam
- telangana cm revanth reddy
- cm revanth reddy jobs news
- ts gurukulam 2024 jobs issues
- ts gurukulam 2024 jobs issues news telugu
- telugu news ts gurukulam 2024 jobs issues
- ts backlog gurukulam 2024 jobs issues
- ts backlog gurukulam 2024 jobs issues news telugu
- gurukula teacher notification 2024 telangana
- TS Gurukula 2000 Backlog Jobs 2024 Issue
- TS Gurukula 2000 Backlog Jobs 2024 Issue News in Telugu
- Backlogjobs in telengana gurukula
- Telengana gurukula jobs
- SakshiEducation latest job notifications