MHSRB: ఆగస్టు 2న స్టాఫ్‌నర్స్ పరీక్ష.. సిలబస్ ఇదీ..
ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి జూన్ 12న వివరాలు వెల్లడించారు. 5,204 స్టాఫ్ నర్సుల ఖాళీల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఓఎంఆర్ ఆధారిత పరీక్షకు బదులుగా సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 80 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. 80 నిమిషాల గడువు విధించారు. పరీక్ష ఇంగ్లిష్‌లో మాత్రమే జరుగుతుంది. 5,204 పోస్టులకు 40,926 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సామర్థ్యంకంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నందున, పరీక్షను మూడు షిఫ్టులలో నిర్వహిస్తారు. వివిధ షిఫ్టులలోని ప్రశ్నపత్రాల క్లిష్టత స్థాయిలలోని వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల స్కోర్‌లను సాధారణీకరించిన తర్వాత మెరిట్ జాబితాను తయారు చేస్తారు. కంప్యూటర్ ద్వారా అభ్యర్థులకు షిఫ్టుల కేటాయింపు జరుగుతుంది. ఒక్కో షిఫ్టులో 13,642 మంది పరీక్ష రాస్తారు. దరఖాస్తుదారులు ఆగస్టు 23వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్/ఔట్‌సోర్స్ సర్వీస్ కాలానికి వచ్చిన వెయిటేజ్ పాయింట్లు, సీబీటీ పరీక్షలో పొందిన మార్కులను ఆధారం చేసుకుని మెరిట్ జాబితా తయారుచేస్తారు.
చదవండి: Central Government: స్టాఫ్ నర్స్.. ఇక నర్సింగ్ ఆఫీసర్
ఇతర ముఖ్యంశాలు...
- ప్రతి షిఫ్ట్‌కి ప్రశ్నపత్రం వేర్వేరుగా ఉన్నందున, ప్రశ్న పత్రాల క్లిష్టత స్థాయిలు కొద్దిగా మారే అవకాశం ఉంది. అయితే అన్ని షిఫ్ట్‌లలోని ప్రశ్నపత్రాలు ఒకే ప్రమాణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
- మల్టిపుల్ షిఫ్టుల వల్ల ఏ విద్యార్థికి ప్రత్యేకంగా ప్రయోజనం జరగకుండా చూసుకోవడం సాధారణీకరణ ప్రధాన లక్ష్యం. సాధారణీకరణ ప్రక్రియ అన్ని షిఫ్టులలో అభ్యర్థులందరినీ తులనాత్మక స్థాయిలో తీసుకువస్తుంది. ఈ ప్రక్రియ కారణంగా, ఈజీ షిఫ్ట్ మార్కులు స్వల్పంగా తగ్గవచ్చు. హార్డ్ షిఫ్ట్ మార్కులు స్వల్పంగా పెరగవచ్చు.
- దరఖాస్తుదారులు ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. Ü అభ్యర్థులకు పరీక్ష పద్ధతిపై అవగాహన రావడం కోసం మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయి. వచ్చేవారం నుంచి మాక్ ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.
- మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 10.20 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.50 వరకు జరుగుతుంది. మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటల నుండి 5.20 గంటల వరకు జరుగుతుంది.
స్టాఫ్‌నర్సు రాత పరీక్ష సిలబస్ ఇదీ..
ఫస్ట్ ఎయిడ్, సైకాలజీ, సోషియాలజీ | ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ | కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ | ఎన్విరాన్‌మెంటల్ హైజీన్ | హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ | న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్ | మెంటల్ హెల్త్ నర్సింగ్ | చైల్డ్ హెల్త్ నర్సింగ్ | మిడ్ వైఫరీ గైనకాలజికల్ నర్సింగ్ | గైనకాలజికల్ నర్సింగ్ | కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ | నర్సింగ్ ఎడ్యుకేషన్ | ఇంట్రడక్షన్ టు రీసెర్చ్ | ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్‌మెంట్ | నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్‌మెంట్