RSETIs: నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ
Sakshi Education
మొయినాబాద్:నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌సెటీ) డైరెక్టర్ రమేష్ జూలై 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మండల పరిధిలోని చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న ఎస్‌బీఐ ఆర్‌సెటీ కేంద్రంలో మహిళలకు మగ్గం వర్క్స్, బ్యూటీపార్లర్ కోర్సుల్లో జూలై 31 నుంచి నెల రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. 19 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి పదో తరగతి చదివిన మహిళలుజూలై 31లోగా చిలుకూరులోని ఎస్‌బీఐ ఆర్‌సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
చదవండి: Job Mela in Andhra Pradesh: 31న జాబ్‌మేళా
దరఖాస్తు ఫారానికి ఎస్‌ఎస్‌సీ మెమో, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలన్నారు. మరిన్ని వివరాలకు 8639079122, 7981951167, 9000778300 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి: Mega Job Fair: జాబ్ మేళా.. 20కి పైగా ప్రముఖ కంపెనీలు
Published date : 29 Jul 2023 03:55PM