Mega Job Fair: జాబ్ మేళా.. 20కి పైగా ప్రముఖ కంపెనీలు
Sakshi Education
మొయినాబాద్: డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) ఆధ్వర్యంలో జూలై 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఈఈటీ జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్ జూలై 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చేవెళ్ల మండల కేంద్రంలోని చైతన్య కళాశాలలో జాబ్‌మేళా జరుగుతుందన్నారు. మహీంద్రా ఫైనాన్స్, టాటా డ్రైవ్, లులు ఇంటర్నేషనల్ షాపింగ్‌మాల్, మెడ్‌ప్లస్, ఢిల్లీవేర్, అపోలో ఫార్మసీ, కార్పోన్ బీపీఓ, మైమోనీకర్మ వంటి 20కి పైగా ప్రముఖ కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొంటాయన్నారు. జిల్లా లోని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
చదవండి:
Published date : 29 Jul 2023 03:39PM