విజయనగరం అర్బన్: నగరంలోని గాజులరేగ పరిధి సీతం ఇంజినీరింగ్ కళాశాలలో జూలై 29న ఉద్యోగ నియామకాలు జరగనున్నాయని కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ్ రావు జూలై 28న ఒక ప్రకటనలో తెలిపారు.
సీతం కళాశాలలో ఉద్యోగ నియామకాలు
టెక్తమ్మినా, డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీలు ఉద్యోగ నియామకాలు కల్పిస్తాయని, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన విద్యార్థులు హాజరుకావచ్చని సూచించారు. ఈ నియామకాలు జూలై 29న ఉదయం 10 గంటల నుంచి నుంచి సాయంత్రం వరకు జరగనున్నాయని, పూర్తి వివరాల కోసం ఫోన్ 9494906561, 7981444642 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.