Skip to main content

Govt College: చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం

Govt College

మద్దిలపాలెం (విశాఖ తూర్పు): ప్రభుత్వ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి డిగ్రీ పట్టాతోపాటు ఉద్యోగం పొందేలా మెగా జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నామని హైయర్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌.పోలా భాస్కరరావు అన్నారు. డాక్టర్‌.వి.ఎస్‌.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం కమిషనర్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ , ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న విద్యకు సార్థకత కావాలంటే ఉద్యోగం రావాలన్నారు. ఆ ఉద్యోగాలను విద్యార్ధులు చదవే కళాశాలలో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా కల్పిచడంమే ధ్యేయంగా ప్రభుత్వం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నాయన్నారు.
​​​​​​​
ఆర్జేడీ ఎస్‌.శోభారాణి మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాలలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయన్నారు. వీటిలో కాంతా రబ్బర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, యోకో హామా టైర్స్‌తోపాటు పలు కంపెనీలు పాల్గొన్నాయి. 11 వందల మంది విద్యార్థులు హాజరుకాగా..244 మంది ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ డాక్టర్‌. అనిల్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ ఐ. విజయబాబు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి సాయి చైతన్య, చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Published date : 22 Jul 2023 01:41PM

Photo Stories