Skip to main content

Latest Anganwadi news: కష్టాల్లో అంగన్‌వాడీలు ఇకపై ఈ కష్టాలు తప్పవ్‌..

Anganwadi Pending Bills News   Anganwadi center in Nizamabad  Anganwadi center with minimal facilities
Anganwadi Pending Bills News

నిజామాబాద్‌ నాగారం: అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు పెరిగిపోతున్నాయి. పది నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె చెల్లించాలని యజమానులు టీచర్లను ఒత్తిడి చేస్తున్నారు. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య జిల్లాలో చాలా అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి.

Good news for Anganwadis: అంగన్‌వాడీ కేంద్రాలకు యూనిఫామ్స్‌

ప్రతి నెల అద్దె బిల్లుల రాకపోవడంతో టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి యజమానులతో చీవాట్లు తప్పడం లేదని వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 1500వరకు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో కొన్ని కేంద్రాలు కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో 605వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

వీటికి గ్రామాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అద్దె ఉంది. పట్టణాల్లో ప్రాంతాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ. 6వేల వరకు అద్దె ఉంది. ఆయా గదులు సైతం ఇరుకుగా ఉండటంతో టీచర్లు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగు నెలల బిల్లులు వచ్చాయి

అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవామే. రెండు రోజుల కిత్రమే నాలుగు నెలల అద్దె బిల్లులు వచ్చాయి. రెండు, మూడు రోజుల్లో బిల్లుల చెల్లింపులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మిగతా అద్దె క్లియర్‌ చేయడానికి ఉన్నతాధికారులకు విన్నవిస్తా. – రసూల్‌బీ, జిల్లా సంక్షేమ శాఖాధికారి

Published date : 06 Jul 2024 01:29PM

Photo Stories