Skip to main content

Good news for Anganwadis: అంగన్‌వాడీ కేంద్రాలకు యూనిఫామ్స్‌

Uniform distribution to pre-primary girls at Anganwadi Centers  Good news for Anganwadis  Government school Anganwadi Center uniform program
Good news for Anganwadis

పెద్దపల్లి రూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ చదువుకుంటున్న చిన్నారులకు యూనిఫామ్స్‌ అందించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఒక్కో చిన్నారికి రెండుజతలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించింది.

Tomorrow Holiday news: రేపు విద్యా సంస్థలు బంద్‌ ఎందుకంటే..

జిల్లాలో మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 278 అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న 6,810 మంది చిన్నారులు అర్హులని ఉన్నతాధికారులకు నివేదించారు. యూనిఫామ్స్‌ తయారీకి అవసరమైన వస్త్రం ఇప్పటికే జిల్లా కార్యాలయానికి చేరుకుంది.

సర్కారు బడుల్లోని అంగన్‌వాడీలకే..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు (బూడిద, ఎరుపురంగు) దుస్తులు అందిస్తామని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు దుస్తులు సమకూర్చిన సంస్థల ద్వారానే అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారులకు యూనిఫామ్స్‌ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా యూనిఫామ్స్‌ కుటించి, చిన్నారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్కొక్కరికి రెండు జతలు..

జిల్లాలోని మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మూడు నుంచి ఆరేళ్లలోపు వయసు గల చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు 278 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల్లో 6,810 మంది చిన్నారులు ఉన్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అందులో 3,547 మంది బాలురు, 3,263 మంది బాలికలు ఉన్నారని వివరించారు. వీరందరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్స్‌ అందిస్తామని వారు వెల్లడించారు.

జిల్లా సమాచారం

ప్రాజెక్టులు 3

(పెద్దపల్లి, మంథని, రామగుండం)

ఎంపికై న సెక్టార్లు 28

ఎంపికై న అంగన్‌వాడీ కేంద్రాలు 278

అర్హులైన విద్యార్థులు 6,810

Published date : 04 Jul 2024 09:34AM

Photo Stories