Skip to main content

Anganwadi workers News: అంగన్‌వాడీల ధర్నా ఎందుకంటే..

Anganwadi Workers Union dharna in Kamareddy Town  anganwadi workers dharna  CITU and Anganwadi Workers Union representatives at the dharna
anganwadi workers dharna

కామారెడ్డి టౌన్‌: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు అన్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సీఐటీయూ, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

Good news for Anganwadis: అంగన్‌వాడీ కేంద్రాలకు యూనిఫామ్స్‌

ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేశ్‌ మాట్లాడుతూ 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఎలాంటి బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఉద్యోగ విరమణ చేయించడం దారుణమన్నారు. తక్షణమే ఉద్యోగ విరమణకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

లేని పక్షంలో ఆందోళలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు విజయ, సరిత, జయప్రద, భాగ్యమ్మ, భారతమ్మ, రమాదేవి, అనసూయ, ఎలిజబెత్‌, భారతి తదితరులు పాల్గొన్నారు.

Published date : 06 Jul 2024 09:35AM

Photo Stories