Skip to main content

Jobs at Kia India : కియా ఇండియా సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులు వీరే..

Technical training for job placement   Training and job opportunities in Kia India  Diploma and B.Tech training initiative  State Skill Development Organization program Job opportunities at Kia India for Engineering and Diploma Students  Eluru District Skill Development Officer Ganta Sudhakar

ఏలూరు: డిప్లొమా, బీటెక్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్‌, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2019 – 2024లో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన 18–25 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని కియా ఇండియాలో ఐదు రోజుల శిక్షణ అనంతరం ట్రైనీలుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు కియా ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ను సెల్‌ 76589 02296లో సంప్రదించాలని కోరారు.

Job Mela : ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో జాబ్ మేళా.. ఎప్పుడు?

Published date : 06 Jul 2024 01:09PM

Photo Stories