Skip to main content

Good News: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త అందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ఐదేళ్ల సర్వీసు నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకా రం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తూ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజేషన్‌ చేసేలా నిబంధన విధించారు.
Good News, contract based  jobs.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

తాజాగా సీఎం జగన్‌ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఫైలుకు ఆగ‌స్టు 16న‌ ఆమోద ముద్ర వేశారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్‌ చేయకుండానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. ఈ నిర్ణయంతో 2014 జూన్‌ 2వ తేదీకి ముందు నియమితులై ఇప్పటి వరకు కొన సా గుతున్న కాంట్రాక్టు ఉద్యోగు­లందరి సర్వీసును రెగ్యులరైజ్‌ చేయనున్నారు.

ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడను­న్నాయి. వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యో­గులకు మేలు చేస్తా నని గత ఎన్నికల ముందు సీఎం జగన్‌ హామీ ఇచ్చి న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం పట్ల  కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు.

చదవండి: SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

నాడు బాబు సర్కారు నమ్మక ద్రోహం..

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని గ తంలో చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పింది. ఎ న్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మో సం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యు లరైజేషన్‌పై ముగ్గురు మంత్రుల బృందాన్ని నియ మిస్తూ 2014 సెప్టెంబర్‌ 9న చంద్రబాబు సర్కారు జీవో 3080 జారీ చేసింది. ఐదేళ్ల పాటు సమావేశాలతో సాగదీసిన మంత్రుల బృందం చివ రికి కోర్టు తీర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ సాధ్యం కాదంది.

చదవండి: India Post Recruitment 2023: ఏ పరీక్ష లేకుండానే 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. పదో తరగతి పాస్ అయితే చాలు

నేడు మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎన్నికల హామీ మేర కు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగ మించి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సిద్ధ మైంది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీ లైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్‌ అధ్యక్షతన వర్కింగ్‌ క మిటీని నియమించింది. ఈ కమిటీలు న్యాయ పరమైన, చట్టపరమైన చిక్కులపై చర్చించాయి.

రెగ్యులరైజేషన్‌పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని కమిటీలు సూచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు దొడ్డి దారి కాకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.  కాంట్రాక్టు ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చిక్కులు ఎదురుకా­కుండా న్యా యపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణ లోకి తీసుకుంది. నాడు బాబు సర్కారు  కోర్టు తీ ర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకుండా మోసగించగా సీఎం జగన్‌ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూనే క్రమబద్ధీక­రణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

Published date : 17 Aug 2023 03:02PM

Photo Stories