Skip to main content

Harish Rao Demands Fill 2 lakh Government Jobs : ఈ ఏడాది ఇంకెప్పుడు 2 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తారు..? గ్రూప్-2 పోస్టులను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో.. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ ఏడాదిలోనే 2 లక్షల ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు.
Harish Rao, BRS MLA, questioning the status of promised government jobs during Telangana Assembly elections   MLA Harish Rao   Telangana Assembly elections   Former minister and BRS MLA Harish Rao

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్‌ పోస్టులు పెంచాలని అడిగిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని..  హామీ మేరకు 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

☛ TS Government Job Calendar 2024 Release : తెలంగాణ‌లో జాబ్ క్యాలెండర్-2024 విడుద‌ల.. ఎప్పుడంటే..? పోస్టుల వివ‌రాలు ఇవే..

 గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 1:50 కాకుండా 1:100 చొప్పున..

 అలాగే గ్రూప్స్‌ పరీక్షలకు మధ్య ప్రిప‌రేష‌న్‌కు వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్‌కు అవకాశమివ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు హరీష్ రావు . 

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1,2,3&4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

TSPSC గ్రూప్-2 పెంచాల్సిందే..
TSPSC గ్రూప్-2లో అదనంగా 2000 పోస్టుల వ‌ర‌కు పెంచాలన్న హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ పరీక్షల మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలన్నారు.

 Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

Published date : 19 Jun 2024 09:03AM

Photo Stories