సాక్షి,హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా డీఎస్సీ–1998 క్యాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డీఎస్సీ–1998 సాధన సమితి కోరింది.
డీఎస్సీ–1998 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వండి
మే 29న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని బృందం కోరింది. ఈ విషయమై కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం చేస్తామని మంత్రి హామీనిచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు.