Skip to main content

DSC qualified candidates: 98 డీఎస్సీ క్వాలిఫైడ్స్ అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్‌

ఏలూరు(మెట్రో): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎంపికై మిగిలిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్‌కు ఏలూరు కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లాపరిషత్‌ మీటింగ్‌ హాలులో కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఎంపికై న ఉపాధ్యాయులకు పోస్టింగ్‌ ఆర్డర్స్‌ అందజేశారు.
నియామక పత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
నియామక పత్రాలు అందిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికై న నూతన ఉపాధ్యాయులంతా విద్యాభివృద్ధి విషయంలో కీలకపాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు ప్రతి విద్యార్థికీ అందించేలా కృషి చేయాలన్నారు. ఎంతోకాలం నిరీక్షణ తర్వాత దక్కిన ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వీ రవిసాగర్‌ మాట్లాడుతూ డీఎస్సీ 1998 అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ ప్రారంభించి పోస్టులకు ఎంపిక చేశామన్నారు. 274 మంది ఉపాధ్యాయులను కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న స్థానాలకు ఎంపిక చేసి పోస్టింగ్‌ ఆర్డర్‌ ఇచ్చామన్నారు. పోస్టింగ్‌ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులంతా గురువారం సంబంధిత పాఠశాలల్లో జాయిన్‌ కావాలని సూచించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్లు అవదాని, షరీఫ్‌, ఎంఈఓ సబ్సితి నరసింహమూర్తి కౌన్సెలింగ్‌ నిర్వహణకు సహకరించారు.

Published date : 13 Apr 2023 06:55PM

Photo Stories