Skip to main content

APVVP: 38 వైద్యుల పోస్టుల భర్తీ

సాక్షి, అమరావతి: ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల భర్తీలో భాగంగా మార్చి 23న నిర్వహించిన వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూల్లో శాశ్వత ప్రాతిపదికన 38 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌) పోస్టు­లు భర్తీ అయ్యాయి.
APVVP
38 వైద్యుల పోస్టుల భర్తీ

ఇందులో 19 జనరల్‌ మెడిసిన్, 14 జనరల్‌ సర్జరీ, మూడు డెర్మటాలజీ, ఒకటి మైక్రోబయాలజీ, ఒకటి ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ పోస్టులు ఉన్నాయి. ఐదు స్పెషాలిటీల్లో 128 పోస్టులను నోటిఫై చేయ­గా, 88 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

చదవండి: 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. సిల‌బ‌స్ ఇదే.. ఇన్ని మార్కులు వ‌స్తే..

కాగా, 50 మంది శాశ్విత ప్రాతిపదికన పోస్టులకు ఎంపికైనప్పటికీ 38 మంది మాత్రమే తమకు కావాల్సిన స్థానాలను ఎంపిక చేసుకుని పోస్టింగ్‌ ఉత్తర్వులు పొందారు. మిగిలిన వారికి మార్చి 24న జూమ్‌ ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి కాంట్రాక్ట్‌ ప్రాతిపదిక పోస్టులు భర్తీ చేయనున్నారు.

చదవండి: రాష్ట్రంలో 14,219 టీచర్‌ పోస్టులు భర్తీ

Published date : 24 Mar 2023 04:55PM

Photo Stories