Skip to main content

రాష్ట్రంలో 14,219 టీచర్‌ పోస్టులు భర్తీ

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 14,219 టీచర్‌ పోస్టులను భర్తీ చేసినట్టు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
14219 teacher posts are filled in the state
రాష్ట్రంలో 14,219 టీచర్‌ పోస్టులు భర్తీ

శాసన మండలిలో మార్చి 20న జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విద్యార్థులకు తగినంత మంది ఉపాధ్యాయులను కేటాయించడంలో దేశంలోనే రాష్ట్రం అగ్రభాగంలో ఉందన్నారు.

చదవండి: కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాలి

ఉపాధ్యాయుల నియామకానికి 2019లో ప్రత్యేక డీఎస్సీ ద్వారా 521 పోస్టులు, 2008 డీఎస్సీలో ఎంపికైన 1,910 మందికి నియామకాలు, 2018 డీఎస్సీలో ఎంపికైన 7,254 మందికి 2021లో నియామకాలు పూర్తి చేసినట్టు వివరించారు. 507 బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి 2022లో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. 1998 డీఎస్సీలో ఎంపికైన 4,534 మంది నియామకానికి మార్చి 15న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.

చదవండి: Central Government Teaching Jobs 2023 : కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు.. ఖాళీల పూర్తి వివ‌రాలు ఇవే.. త్వ‌ర‌లోనే..

రాష్ట్రంలో ఇంకా 717 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటాయని, వాటి భర్తీకి డీఎస్సీపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సూచనలను కూడా తీసుకుంటామన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలను మెరుగుపర్చడానికి, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకం ద్వారా మూడేళ్లుగా రూ.19,617.6 కోట్లను తల్లుల ఖాతాలకు జమ చేసినట్టు తెలిపారు. 

చదవండి: ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది

Published date : 21 Mar 2023 05:07PM

Photo Stories