Central Government Teaching Jobs 2023 : కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు.. ఖాళీల పూర్తి వివరాలు ఇవే.. త్వరలోనే..
అలాగే ఇటీవలే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన విషయం తెల్సిందే.
వివిధ విభాగాల్లో 9,79,327 లక్షల ఉద్యోగాలు..
2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 9,79,327 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో అత్యధికంగా రైల్వేలో 2.93 లక్షల పోస్టులు ఉన్నట్లు నివేదించింది. తర్వాత ప్రాధాన్యతలో రక్షణశాఖ 2.64 లక్షలు, హోంశాఖ 1.43 లక్షల, కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు ఖాళీలను కలిగివున్నాయి. రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
కేంద్ర విద్యాశాఖలోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల వివరాలు ఇవే..
కేంద్రీయ విద్యాలయాలు : 18,411
నవోదయ పాఠశాలలు : 5,027
సెంట్రల్ వర్సిటీలు : 21,978
ఐఐటీలు : 9477
ఎస్ఐటీలు, ఐఐఈఎస్ఓలు : 5862
ఐఐఎసీసీ, ఐఐఎస్ఈఆర్ : 978
ఐఐఎంఎస్ : 1,050.
కేంద్ర ప్రభుత్వలోని 9,79,327 లక్షల ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..