కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాలి
ఒకవేళ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగి, కొత్త టీచర్లు రాని పరిస్థితి ఉన్నప్పుడు బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయబోమని, కొత్త టీచర్లు వచ్చే వరకు అక్కడే కొనసాగాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్‌పై సభ్యుల ప్రసంగాల్లో భాగంగా ఉపాధ్యాయ బదిలీలపై పలు అంశాలు లేవనెత్తారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం జోక్యం చేసుకుంటూ జీఓ 317లో భాగంగా పలువురు ఉపాధ్యాయులకు పల్లె బడుల్లో పోస్టింగ్ లిచ్చారని, తాజాగా బదిలీల నిబంధనల సడలింపుతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీ అయ్యే ప్రమాదముందంటూ సూచనలు చేశారు. దీనిపై మంత్రి పైవిధంగా స్పందించారు.
చదవండి: చెమట చిందించని నేటితరం.. రోజుకు గంట ఇదీ తప్పనిసరి..
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా టీచర్ లేని పాఠశాలలు ఉండకూడదనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని వివరించారు. జీఓ 317 బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, జిల్లాల్లో ఖాళీల ఆధారంగా వారికి సొంత ప్రాంతాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యుడు ఏ.నర్సిరెడ్డి సూచించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన క్రమబదీ్ధకరణ చేయాలని, కనిసీ వేతనాన్ని రూ.25వేలకు పెంచాలని కోరారు. యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించిన బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ త్వరితంగా ఆమోదించాలని, దీంతో నియామకాల ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలలు నిర్దేశించిన లొకేషన్లలో కాకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని, దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా లేదని, తక్షణ చర్యలు తీసుకోవాలని మరో సభ్యుడు కె.జనార్ధన్‌రెడ్డి కోరారు.
చదవండి: అందమైన రాతలో ఆంధ్రాదే పైచేయి