TS Competitive Exams Postponed 2023 : ఎన్నికల అలర్ట్.. పరీక్షలపై ఎఫెక్ట్...! పలు పోటీపరీక్షలను..
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీ అయింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 వాయిదా పడింది. అలాగే డీఎస్సీ కూడా వాయిదా వేశారు. ఇంకా జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. అలాగే గ్రూప్-4 పరీక్ష ఫలితాలను కూడా వాయిదా వేసే అవకాశం ఉంది.
నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే..
దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన ప్రకటనల తాలూకు పరీక్షల నిర్వహణ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా కారణాలు, సిబ్బంది సమస్యలతో అర్హత పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.
పోటీ పరీక్షలు సరే... ఇక ఫలితాల సంగతి మాటేంటి..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక సంస్థలు సైతం ఎంతో ఉత్సాహంతో భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే 38 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది.తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దాదాపు 11 వేల ఉద్యోగాలకు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మరో 17 వేల ఉద్యోగాలకు, తెలంగాణ మెడికల్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎంఎస్‌ఆర్‌బీ) 10 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. వీటితో పాటు ఇటీవల డీఎస్సీ ద్వారా 6 వేల టీచర్ ఉద్యోగాలకు సైతం ప్రకటనలు వెలువడ్డాయి. డీఎస్సీ, గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి.
☛ TS TRT 2023 Postponed : బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణ డీఎస్సీ వాయిదా.. కొత్త తేదీలు..
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. గురుకుల బోర్డు కూడా ఫలితాలను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామక సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనని వారు ఎదురు చూస్తున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలను వదులుకుని ప్రభుత్వ కొలువులకు సన్నద్దమైన అభ్యర్థులకు ఫలితాల కోసం నిరీక్షణ తప్పేలా లేదు.
Tags
- tspsc exam postponed
- ts trt 2023 postponed
- ts assembly elections 2023
- due to ts assembly elections 2023 tspsc group 2 exam postponed
- due to ts assembly elections 2023 ts competitive exams postponed 2023 telugu news
- competitive exam postponed 2023 telangana
- tspsc exams new exam dates 2023
- ts trt new exam dates 2023
- Assembly elections in Telangana
- Gazette notification release
- Telangana politics
- Election timeline
- Central Election Commission schedule
- Sakshi Education Latest News