TSPSC Group 2 Again Postponed 2023 : బ్రేకింగ్ న్యూస్.. 'సారీ'.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 మళ్లీ వాయిదా.. కారణం ఇదే..కొత్త పరీక్షల తేదీలు ఇవే..
నవంబరు 2,3 తేదీల్లో ఈ గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. వాయిదా పడిన ఈ గ్రూప్-2 పరీక్షలను తిరిగి వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెల్సిందే.
☛ TS DSC 2023 Postponed : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఇక డీఎస్సీ వాయిదానే.. లేదంటే..?
ఇది రెండో సారి..
TSPSC Group 2 పరీక్షను టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 10వ తేదీన (మంగళవారం) జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది.
అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసిన ప్రభుత్వం.. నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
డీఎస్సీ పరీక్ష కూడా ..?
టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్-2023లో భాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ) పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించాలి. నవంబరు 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కనీసం ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పదనే అభిప్రాయం వినబడుతోంది.
ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని.. అందువల్ల టీఆర్‌టీ నిర్వహణపై దృష్టి పెట్టడం సాధ్యంకాదని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. నవంబరు 20 నుంచి 24 వరకు జరిగే స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టుల పరీక్షలకు ఇబ్బందిలేదనే విషయం కూడా వినబడుతోంది. మరి ప్రభుత్వం, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.
గ్రూప్-4 ఫలితాలు కూడా..?
దీంతో మొత్తం ఉపాధ్యాయ పరీక్షలు వాయిదా వేస్తారా? ఆ రోజు జరగాల్సినవి మాత్రమే వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు నుంచే అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై దృష్టిపెట్టాల్సి రావడంతో టీచర్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
Tags
- TSPSC Group 2 Exam Postponed
- tspsc group 2 exam again postponed 2023
- tspsc group 2 exam 2nd time postponed
- tspsc groups exam postponed 2023 news telugu
- due to ts assembly elections 2023 ts trt exam postponed
- due to assembly elections tspsc group 2 exam postponed
- tspsc group 2 exams postponed
- tspsc group 2 exams again postponed 2023
- TSPSC
- sakshi education
- TelanganaHighCourt
- Group1Cancellation
- TSPSC Group 2
- AssemblyElections
- tspsc latest news 2023