Skip to main content

TS Police Constable Certificate Verification Documents : పోలీస్‌ కానిస్టేబుళ్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డ విష‌యం తెల్సిందే.TSLPRB కానిస్టేబుళ్ల అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో.. తదుపరి చర్యలపై దృష్టి సారించింది.
TSLPRB Recruitment Process for Constables, ts police constable certificate verification details in telugu,TSLPRB Final List of Constables Candidates
ts police constable certificate verification

ఇక ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాలు పరిశీలనతో పాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులు ముందుగా తమ ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను అక్టోబ‌ర్ 13వ తేదీలోగా సమర్పించాల్సి ఉంది.

☛ TS Constable Cut off Marks 2023 : టీఎస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు ఇవే.. కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..

ధ్రువపత్రాల పరిశీలన‌..
ఇదే సమయంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్దుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిన 18 కేంద్రాల నుంచి ఆయా యూనిట్ల అధికారులు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకోనున్నారు. ముందుగా సమర్పించిన పత్రాలతో అటెస్టేషన్ పత్రాలను సరిపోల్చి పరిశీలించడంతో పాటు అభ్యర్థులకు ఏదైనా నేరచరిత్ర ఉందా..? అనేది తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసుల పర్యవేక్షణలో జరగనుంది.

నవంబరు 20 వరకు..?

ts police jobs 2023

12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళ అభ్యర్థులకు సంబంధించి ఎస్బీ విచారణ ప్రక్రియను త్వరితగతిన చేపడితే నవంబరు 20 వరకు కొనసాగే ఆస్కారం ఉండడంతో ఆ తర్వాతే కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

☛ TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

అటెస్టేషన్‌ ఎలా చేయాలంటే...?
TSLPRB బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్‌ ఫారం తీసుకోవాలి. టీఎస్‌ఎల్పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో అక్టోబ‌ర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్‌ టెంప్లేట్‌ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్‌గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్‌ రూపంలో మూడు సెట్‌లు ప్రింట్‌లు ఏ4 సైజు పేపర్‌పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మూడు సెట్‌లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్‌పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి.

☛ Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్క‌డంటే..

ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి అక్టోబ‌ర్ 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి. సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు అక్టోబ‌ర్ 12న ఎస్పీ/ కమిషనర్‌ కార్యాలయాల్లో,  ఎస్పీఎఫ్, ఎస్‌ఏఆర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్టు (హెచ్‌ఓ) కానిస్టేబుళ్లు అక్టోబ‌ర్ 13న హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో,  మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో అటెస్టేషన్‌ ఫారంలు సమర్పించాలి.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

Published date : 09 Oct 2023 03:26PM

Photo Stories