Skip to main content

KGBV Posts: కేజీబీవీ నియామకాల్లో గందరగోళం

ఆదిలాబాద్‌టౌన్‌: మేమింతే.. మారం.. ఎవరి మాట వినం.. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోం.. నచ్చినట్లే చేస్తాం.. నిబంధనలు గాలికొదిలేస్తాం.. అన్న చందంగా మారింది జిల్లా విద్యాశాఖ తీరు.
Confusion in KGBV appointments
డీఈవో ఎదుట కంటతడిపెట్టిన అభ్యర్థి

వీరి చేష్టలతో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఓరల్‌ డిప్యూటేషన్లు కల్పిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. వారికి అనుకూలంగా ఉన్న టీచర్లకు, రాజకీయ పైరవీలు చేసిన వారికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుండగా, విద్యార్థులు సైతం చదువుల పరంగా నష్టపోతున్నారు. ఇటీవల కేజీబీవీ నియామక ప్రక్రియలోనూ గందరగోళం చోటుచేసుకోవడం తెలిసిందే.

చదవండి: Motukuri Chandralekha: పేద విద్యార్థులకు ఆదర్శం చంద్రలేఖ

అంతా గోల్‌మాల్‌..

ఇటీవల జరిగిన కేజీబీవీ నియామకాల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్‌కు సంబంధించి ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడి భార్యకు మేలు చేసేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆమె సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయకపోయినప్పటికీ తుది జాబితాలో పేరు నమోదు చేయడం గమనార్హం. ఎంపికై న అభ్యర్థి పేరు లేకపోవడంతో బాధితురాలు అధికారులను నిలదీయడంతో విషయం బయటకు పొక్కింది. ఆ తర్వాత ఆ సంఘం నాయకుడి భార్య పేరును తొలగించి అర్హత గల వారికి పోస్టింగ్‌ కల్పించారు.

చదవండి: Jobs: 43 పోస్టులు.. 106 మంది అభ్యర్థులు

కేజీబీవీ నియామకాల్లో భాగంగా జిల్లాలో సాంఘిక శాస్త్రం సీఆర్టీలో ఒకే పోస్టు ఉంది.
మొదటి ర్యాంక్‌ వచ్చిన అభ్యర్థి ఎంపికై ంది. ఇదిలా ఉండగా గాదిగూడ పోస్టింగ్‌ ఉన్న ఓ సీఆర్టీ కొన్నేళ్లుగా ఆదిలాబాద్‌లోని కేజీబీవీలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి బంధువు కావడంతో ఇటీవల డైరెక్టరేట్‌ నుంచి బదిలీ ఉత్తర్వులు తీసుకొచ్చి బోథ్‌ కేజీబీవీలో చేరారు.

నోటిఫికేషన్‌లో మాత్రం బోథ్‌ కేజీబీవీలో సాంఘిక శాస్త్రం పోస్టు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చూపించారు. తీరా ఎంపికై న అభ్యర్థి బోథ్‌కు వెళితే అక్కడ ఆ పోస్టు భర్తీ ఉండడంతో సదరు అభ్యర్థి లబోదిబోమంది. గాదిగూడ కేజీబీవీకి వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ క్రమంలో బుధవారం ఆమె డీఈవోను కలిసి కంటతడి పెట్టింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలాగే మావలకు చెందిన మరో అభ్యర్థి శారద కేజీబీవీలో ఖాళీగా ఉన్న నర్సింగ్‌ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది.

చదవండి: State Best School Award: ఉత్తమ విద్యాలయంగా రేగులపాడు KGBV
ఆమెకు 5వ ర్యాంక్‌ వచ్చింది. ఈ అభ్యర్థి ఆసిఫాబాద్‌ జిల్లాలో 1 నుంచి 4వ తరగతి వరకు చదవగా, మిగతా చదువు ఆదిలాబాద్‌ జిల్లాలో పూర్తి చేసింది. ఈ పోస్టులో ఆమెను ఆదిలాబాద్‌ నాన్‌లోకల్‌గా చూపించారు. ఆసిఫాబాద్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నా ఆమెకు పోస్టింగ్‌ దక్కకపోవడతో నష్టపోవాల్సి వచ్చింది.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అలాగే కొంతమంది ఉపాధ్యాయులకు ఎక్కడబడితే అక్కడ ఓరల్‌ డిప్యూటేషన్లు ఇవ్వడంతో విద్యార్థులు నష్టపోతున్నారు.
ఆదిలాబాద్‌ పట్టణంలోని ఆర్పీఎల్‌ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు ఓరల్‌ డిప్యూటేషన్‌పై నార్నూర్‌ మండలంలోని గంగాపూర్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.

విద్యాశాఖాధికారులు సంబంధిత పాఠశాల హెచ్‌ఎంకు ఓరల్‌గా ఫోన్‌ చేసి ఆమెను డిప్యూటేషన్‌పై పంపించాలని ఆదేశించారు. ఈ పాఠశాలలో 90 మంది వరకు విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం వీరి చదువులకు ఆటంకం కలుగుతుంది.
నార్నూర్‌ మండలంలోని భీంపూర్‌ ఉన్నత పాఠశాలలో బోధించే బయోసైన్స్‌ ఉపాధ్యాయుడిని ఆదిలాబాద్‌రూరల్‌ మండలం చాందా(టి)కు ఓరల్‌ డిప్యూటేషన్‌ కల్పించారు. భీంపూర్‌ పాఠశాలకు మరో పాఠశాలలో పనిచేసే ఎస్జీటీకి డిప్యూటేషన్‌పై పంపించారు. దీంతో ఉన్నత పాఠశాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.
భీంపూర్‌తో పాటు సర్దుబాటు చేసిన పాఠశాల విద్యార్థులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే నార్నూర్‌ మండలంలోని మరో పాఠశాల నుంచి గుడిహత్నూర్‌ మండలంలోని ఓ పాఠశాలకు ఓరల్‌ డిప్యూటేషన్‌ కల్పించారు.

పొరపాటు వాస్తవమే..

బోథ్‌ కేజీబీవీలో పోస్టు ఖాళీగా లేకపోయినప్పటికీ పొరపాటుగా పోస్టు కల్పించాం. ఖాళీగా ఉన్న గాదిగూడ కేజీబీవీలో తిరిగి పోస్టింగ్‌ ఇచ్చాం. కేజీబీవీల నియామకాలను పకడ్బందీగా చేపట్టాం. అలాగే అవసరం ఉన్నచోట ఉపాధ్యాయుల సర్దుబాటు
చేపట్టాము. 

– ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

Published date : 17 Aug 2023 04:05PM

Photo Stories