Skip to main content

Jobs: 43 పోస్టులు.. 106 మంది అభ్యర్థులు

భువనగిరి : జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 43 పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
Jobs
43 పోస్టులు.. 106 మంది అభ్యర్థులు

మొత్తం 573 దరఖాస్తులు రాగా ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున పిలిచి ఆగ‌స్టు 11న‌ డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్‌లను పరిశీలించారు. 109 మంది అభ్యర్థులకు 106 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 5కౌంటర్లు ఏర్పాటు చేశారు. సరిఫికెట్ల పరిశీలన అనంతరం జాబితాపై ఆగ‌స్టు 12న‌ మధ్యాహ్నం 2 గంటల లోపు అభ్యంతరాలు స్వీకరించి పరిశీలిస్తారు. సాయంత్రం తుది జాబితా వెల్లడించనున్నారు. ఎంపికై న వారికి 13న నిర్వహించే కౌన్సిలింగ్‌ తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ నారాయణరెడ్డి సూచించారు.

చదవండి:

KGBV Jobs: పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Free training: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ

Published date : 12 Aug 2023 04:16PM

Photo Stories