Skip to main content

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిలో శిక్షణ

Free training for unemployed youth
Free training for unemployed youth

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): నిరుద్యోగ యువతకు ఈ నెలలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జనశిక్షణ సంస్థాన్‌ డైరెక్టర్‌ ఎ.పూర్ణిమ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలరక్రికల్‌ టెక్నీషియన్‌ హెల్పర్‌, వైర్‌మన్‌ హెల్పర్‌, అసిస్టెంట్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఫ్యాబ్రికేషన్‌ వెల్డర్‌ అసిస్టెంట్‌, ప్లంబ్లింగ్‌ అండ్‌ శానిటరీ వర్క్‌ అసిస్టెంట్‌, డ్రెస్‌ డిజైనింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, అసిస్టెంట్‌ టెక్స్‌టైల్‌ ప్రింటింగ్‌, మిర్రర్‌ వర్క్‌, అసిస్టెంట్‌ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ, హోమ్‌ క్రాఫ్ట్స్‌ మేకింగ్‌, జామ్‌ అండ్‌ జ్యూస్‌ మేకింగ్‌, మెషిన్‌ ఎంబ్రాయిడరీ కోర్సుల్లో ఈ నెల 12 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు విజయవాడ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లోని తమ సంస్థ కార్యాలయంలో నేరుగా, లేదా 0866–2470420 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Published date : 11 Aug 2023 04:56PM

Photo Stories